NRI-NRT

ఆసక్తిగా సాగిన కెనడా-అమెరికా తెలుగు సదస్సు

ఆసక్తిగా సాగిన కెనడా-అమెరికా తెలుగు సదస్సు

కెనడా-అమెరికా తెలుగు సదస్సు 2021 ఘనంగా నిర్వహించారు. కెనడా, అమెరికాలకు చెందిన పలువురు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ రచనలను సభికులకు పరిచయం చేశారు. కెనడా-అమెరికా మధ్య సత్సంబంధాలు పెరిగి, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యాభివృద్ధికి ఈ సదస్సు దోహదపడుతుందని వక్తలు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వంగూరి ఫౌండేషన్ నిర్వాహకుడు చిట్టెన్‌రాజుకు సభికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీ రాయవరపు, కెనడా మంత్రి ప్రసాద్ పండా, రచయితలు తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ, డేనియల్ నైజర్స్, భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, మహెజబీన్ తమ ప్రసంగాలతో అలరించారు. వంగూరి ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా, టొరాంటో తెలుగు టైమ్‌స్, ఓంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఆటవా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణా అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరాంటోలు ఈ సదస్సు నిర్వహణలో భాగస్వాములయ్యారు.