Movies

వెంకటేష్ వైరల్ ట్వీట్

వెంకటేష్ వైరల్ ట్వీట్

ఇకపై భార్యాభర్తలుగా కలిసి ఉండటం లేదంటూ ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు నాగచైతన్య-సమంత జోడీ. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్‌ పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్‌ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.