పత్తి(దూదిపూల) ధర వెలుగుతోంది. ఆదోనిలో మార్కెట్లో గురువారం 4,692 క్వింటాళ్ల పత్తి విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్ఠ ధర రూ.8,339 పలికింది. వారం రోజుల్లో దాదాపు తొమ్మిదివేల మంది రైతులు 38,000 క్వింటాళ్ల వరకు విక్రయించారు. రూ.20-25 కోట్ల మేర వ్యాపారం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 26,204 మంది రైతులు 1.13 లక్షల క్వింటాళ్ల పత్తిని ఆదోని మార్కెట్లో విక్రయించారు. జిల్లాతోపాటు తెలంగాణ, కర్ణాటక రైతులు ఇక్కడికి వస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ పెరగడంతో ఒక్కో లాట్‌కు గరిష్ఠంగా 25 మంది బిడ్డింగ్‌లో పాల్గొంటున్నారు. దేశీయ మార్కెట్లో దూది, పత్తి గింజలకు డిమాండు ఉండటంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి…!!
ఆదోనీ పత్తి మార్కెట్ కళకళ
Related tags :