DailyDose

రంగు డబ్బాల మాటున అక్రమ మద్యం-నేరవార్తలు

రంగు డబ్బాల మాటున అక్రమ మద్యం-నేరవార్తలు

* గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో రంగుల డబ్బాలతో వెళుతున్న లారీలో అక్రమ మద్యం తరలిస్తున్నారని సమాచారంతో  ఎస్ఈబి అధికారులు దాడులు నిర్వహించారు.గోవా నుంచి గుంటూరు జిల్లా పొత్తూరు రంగుల డబ్బాల మధ్యలో పెట్టుకుని 1200ల మద్యం సీసాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యం సీసాల తో పాటు రంగులు, లారీ తో కలిపి మొత్తం రూ 42 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నారు…!!

* విస్సన్నపేట మం తెల్లదేవరపల్లి గ్రామ శివారులో తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి ఈ ప్రమాదం లో ఎవరికి గాయాలు కాలేదు

* ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో…నిందితుడిని పట్టుకునేందుకు వచ్చిన దుండిగల్ పోలీసులు. భవనం పై నుంచి పడి మృతి చెందిన నిందితుడు.

* పశ్చిమ గోదావరి జిల్లా SP శ్రీ రాహుల్దేవ్ శర్మ గారి ఆదేశాల పై, మరియు పోలవరం DSP శ్రీమతి లతా కుమారి గారి ఆదేశాలపై, పోలవరం సి.ఐ నవీన్ నరసింహమూర్తి, పోలవరం ఎస్.ఐ ఆర్ శ్రీను గార్లు వారి సిబ్బంది, excise మరియు GMSK లతో కలిసి పోలవరం మండలం కొమ్ముగూడెం, పాత కొమ్ముగూడెం మరియు వెంకటరెడ్డిగూడెం గ్రామాలను ను కార్డెన్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డెన్ సర్చ్ లో భాగంగా గ్రామంలో ఉన్న సారా తయారు చేయు వారి ఇళ్లను సోదా చేయడం జరిగింది. ఈ సోదాల్లో కొమ్ముగూడెం గ్రామస్తుడు బానోతు రాము s/o నాని అను అతని ఇంట్లో 30 లీటర్ ల సారా దొరకడం జరిగింది. అతనిని అదుపులోకి తీసుకుని అతను సారా తయారుచేయు రహస్య స్థావరం వద్ద 1000 లీటర్ ల బెల్లపు ఊట ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో 60 kg ల బెల్లం, 10 kg ల పంచదార, సారా తయారు చేయుటకు ఉపయోగించే పాత్రలు 6 స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలవరం SI గారు కేసు నమోదు చేయటం జరిగింది. ఇతని పై గతంలో కూడా పలు సారా కేసులు ఉన్నాయి. ఇతని పై suspect sheet ఓపెన్ చేయటం జరుగుతుంది అని పోలవరం CI గారు తెలిపారు.

* పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో ఐ.పి.ఎల్. క్రికెట్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా ను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేసారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ పక్క వీధిలో ఒక ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న బెట్టింగ్ స్థావరం పై పోలీసులు దాడి చేసారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి ఒక ఎల్.ఈ.డి. టీవీ, రెండు లాప్ టాప్ లు, పది సెల్ ఫోన్ లు, 1,15,000/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీరే కాకుండా ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించిన జంగారెడ్డిగూడెం పోలీసులు.

* ఇంద్రకీలాద్రి వద్ద అధికారుల అత్యుత్సాహం..విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలో నిలిపివేసిన పోలీసులు..స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించక పోవడం పై ఎంపీ అసహనం..తన కుటుంబ సభ్యులతో కలసి కాలి నడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి నడిచి కిందకు వచ్చిన ఎంపీ కేశినేని నాని వీఐపీ పాస్ లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహించిన ఎంపీ సహాయకులు..అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు…