Sports

ద్రావిడ్ పేరు ఖరారు

ద్రావిడ్ పేరు ఖరారు

టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పేరు దాదాపు ఖరారైంది. కోచ్‌గా ద్రవిడ్‌ను ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు. అయితే రాహుల్ ద్రవిడ్‌ ఎంపికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత.. నవంబరు 14తో ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. కివీస్‌ పర్యటన నుంచి ద్రవిడ్‌ బాధ్యతలు చేపడతారని.. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు ద్రవిడ్‌ భారత జట్టుకు కోచ్‌గా ఉంటారని వెల్లడించారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా, ఇండియా-ఏ జట్టకు కోచ్‌గా ద్రవిడ్‌ ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.