Movies

అవార్డు సందర్భంగా బాధపడుతున్న రజనీ

అవార్డు సందర్భంగా బాధపడుతున్న రజనీ

సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనని వరించడం పట్ల అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీకాంత్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసం వద్ద రజనీ మీడియాతో మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ అవార్డు నాకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఈ సమయంలో నా గురువు కె.బాలచందర్‌ మన మధ్య లేకపోవడం నాకెంతో బాధగా ఉంది’’ అని రజనీ తెలిపారు.