Business

కోల్గేట్ లాభం ₹296కోట్లు. మంగళగిరిలో చేనేత బజార్-వాణిజ్యం

కోల్గేట్ లాభం ₹296కోట్లు. మంగళగిరిలో చేనేత బజార్-వాణిజ్యం

* ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను ఆవిష్కరించిన జియో.ప్రతీ భారతీయుడికి డిజిటల్ అనుసంధానతను అందించాలన్న ఆశయాన్ని పునరుద్ఘాటించిన జియో.జియో ఫోన్ నెక్ట్స్ ను రూపొందించడంలో తన ఆశయం, గూగుల్, క్వాల్ కమ్ లతో భాగస్వామలతో ప్రయత్నాల గురించి వెల్లడి.దీపావళి రాబోతున్న నేపథ్యంలో ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది.ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధఇంచిన ఆశయం, దాని ఆవిష్కరణ వెనుక ఉన్న ఆలోచనలను ఈ షార్ట్ వీడియో తెలియజేస్తుంది.భారతీయత కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్న ఈ నూతన ఫోన్ ఇప్పటికే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే జియో భారత్ లో ఇంటింటా వినిపించే పేరుగా మారింది. 43 కోట్ల మంది వినియోగదారులతో అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల్లో, ఆదాయ వర్గాల్లో దీని సేవలు విస్తరించాయి.

* మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో చేనేత బజార్ షాపింగ్ కాంప్లెక్స్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ.మంగళగిరి పట్టణం పాత బస్టాండ్ సెంటర్ లో సుమారు 3కోట్ల 90 లక్షల వ్యయంతో నిర్మాణం కానున్న చేనేత బజార్.

* కాలు జారితే తీసుకోగలం.. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం సరికదా దాని పర్యవసనాలు కూడా అనుభవించాల్సిందే..! చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు ఎదురైన పరిస్థితి ఇలాంటిదే. సరిగ్గా ఏడాది క్రితం అనాలోచిత వ్యాఖ్యలు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు జాక్‌ మా. చైనా పాలకుల ఆగ్రహానికి గురై భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. మరి ఆ మాట ఖరీదు ఎంతో తెలుసా.. 344 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 25లక్షల కోట్లకు పైమాటే..! అది 2020 అక్టోబరు 24.. చైనాలో ‘ది బండ్ సమిట్‌’ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాక్ మా ఓ ప్రసంగం చేశారు. అందులో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఎద్దేవా చేశారు.

* ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ కోల్గేట్‌-పామోలివ్‌ నికర లాభం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో 1.83 శాతం తగ్గి రూ.269.17 నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.274.19గా ఉన్నాయి. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో 5.19 శాతం వృద్ధి నమోదై రూ.1,343.96 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో వ్యయాలు రూ.998.05 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది ఇవి రూ.924.12 కోట్లుగా ఉన్నాయి. ఇక సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో.. ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.19 మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈరోజు ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు 1.95 శాతం పడిపోయి రూ.1,534 వద్ద స్థిరపడ్డాయి.