* దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది.ఎల్పీజీ డెలివరీ సిస్టమ్వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో ఈ మార్పు రానుంది.డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులుబ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్‌డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి.బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రైల్వే టైమ్ టేబుల్దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది.నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్‌టేబుల్ ప్రకటించనుంది.భారతీయ రైల్వేస్ ప్రకారం 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్‌లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది.ఎల్పీజీ ధరలుగ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి.
* తెలంగాణలో కొత్త మద్యం పాలసీకి రంగం సిద్ధమైంది. దీన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా మద్యం పాలసీ రెండేళ్లకోసారి అక్టోబరుతో పాలసీ గడువు ముగుస్తుంది. నవంబరు నుంచి కొత్త పాలసీ మొదలవుతుంది. అయితే ఈసారి కరోనా లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడినందున పాత లైసెన్స్‌లను నెల పాటు పొడిగించారు. దీంతో వచ్చే డిసెంబరు నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇందుకోసం దీపావళి తర్వాత దుకాణాలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ విధివిధానాలను ఖరారు చేయడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నవంబరు 2న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం రాగానే కొత్త పాలసీపై నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభించి వారం రోజులపాటు దరఖాస్తులు స్వీకరించే అవకాశముంది. గత పాలసీలో రాష్ట్రవ్యాప్తంగా 2216 మద్యం దుకాణాలుండగా ఈసారి 10శాతం వరకు దుకాణాలు పెరగనున్నట్లు సమాచారం. గత మద్యం పాలసీలో దుకాణాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ చిక్కులన్నీ తొలిగాకే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
* మరోసారి పెరిగిన చమురు ధరలు.దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి.- లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ధరల పెంపు కొనసాగుతోంది.తాజాగా లీటర్‌కు 35 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.99కు చేరగా.. డీజిల్ ధర రూ.97.73కు పెరిగింది.ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ.114.77కు చేరగా.. లీటర్ డీజిల్ 38 పైసలు పెరిగి రూ.105.83 వద్ద కొనసాగుతోంది.కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి రూ.109.42గా ఉంది. లీటర్ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.80 వద్ద కొనసాగుతోంది.చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు పెరిగి రూ.105.70 వద్ద కొనసాగుతోంది. లీటర్ డీజిల్ ధర 33 పైసలు రూ.101.88కు చేరింది.
* ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలుకావడంతో ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు బంద్ అయ్యాయి. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ప్రభుత్వరంగ సంస్థగా ఉండటం వల్ల ఎంపీలకు ప్రొటోకాల్ అమలు చేసేవారు. ఇకమీదట ఆ సదుపాయం ఉండదు. ఎంపీలు డబ్బు పెట్టి విమాన టికెట్లు కొనాలని శుక్రవారం విడుదలైన రాజ్యసభ సచివాలయ బులెటిన్ సభ్యులకు సూచించింది. పార్లమెంటు సభ్యులకు వ్యక్తిగతంగా 34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి మరో 8 టికెట్లు గతంలో ఉచితంగా ఇచ్చేవారు. వాటి కొనుగోలుకు పార్లమెంటు ఉభయసభల సచివాలయాలు ‘ఎక్స్ఛేంజ్ ఆర్డర్’ జారీ చేసేవి. ఆ ఉత్తర్వులు చూపి డబ్బు పెట్టకుండానే ఎంపీలు ఎయిర్ ఇండియా టికెట్లు కొనుగోలు చేయడానికి వీలుండేది. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. రాజ్యసభ, లోక్‌సభ సచివాలయాలు ఇప్పటికే జారీ చేసిన ఎక్స్ఛేంజ్ ఆర్డర్లను అనుసరించి టికెట్లు కొని ఉంటే అందుకు సంబంధించిన టీఏ క్లెయిమ్‌లు చేసుకోవచ్చు.