గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సూర్య శిల్పశాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇనుప వ్యర్థాలు, నట్లుతో ఇక్కడ రూపొందించిన భారీ విగ్రహాలకు ‘అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం దక్కిందని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర శనివారం తెలిపారు. ఈ మేరకు తమకు ధ్రువపత్రం అందిందని చెప్పారు. దాదాపు 75 వేల నట్లతో రూపొందించిన గాంధీజీ ప్రతిమతో పాటు దాదాపు 100 టన్నుల ఇనుప ముక్కలతో తయారైన ఇతర కళాఖండాలను ప్రత్యేకంగా ప్రస్తావించారని పేర్కొన్నారు.
తెనాలి ఇనుప నట్ల శిల్పాలకు అమెరికా గౌరవం
Related tags :