* దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లకు కళ్లెం వేసేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీపావళి పండగ వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలకు కొంతమేర ఉపశమనాన్ని కలిగించేదే. కొన్ని రాష్ట్రాలు సైతం కేంద్రం బాటను అనుసరించాయి. ఆయా రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పిస్తూ వ్యాట్‌ను తగ్గించాయి. అసోం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలు వ్యాట్‌లో కోత విధించాయి. కేంద్రం తన నిర్ణయం ప్రకటించిన కాసేపటికే అసోం, త్రిపుర తమ నిర్ణయాన్ని ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు ప్రకటన వెలువరించాయి. ఒక్క ఒడిశా మినహా తగ్గింపు ప్రకటించిన రాష్ట్రాలన్నీ దాదాపు భాజపా పాలిత, ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం.
* పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, భాజపా పాలిత రాష్ట్రాలూ వ్యాట్ తగ్గించాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సీఎం జగన్ కూడా ఏపీ ప్రజలకు అధిక ధరల నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు. దీపావళి పండుగ వేళ కేంద్రం నిన్న పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 సుంకం తగ్గించాయి. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
* అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, సల్మాన్ ఖాన్, మలయాళ నటుడు రిమా కల్లింగల్ వంటి నటులు సరికొత్త బిజినెస్‌లోకి అడుగు పెడుతున్నారు. ఆ బిజినెస్ పేరు ఏంటో తెలుసా? ఎన్ఎఫ్టీ. ఎన్ఎఫ్టీ అంటే డిజిటల్ ఆస్తులు. సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు, వీడియోలను సైతం డిజిటల్ ఫార్మాట్లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటిని వారు తిరిగి వేలం కూడా వేసుకోవచ్చును. ఎన్ఎఫ్టీలను కొన్నవారు తిరిగి వాటిని వేలం వేసుకోవచ్చును. ఇలా వేలం జరిగినప్పుడులా వేలం అమౌంట్లో 10 శాతం ఎన్ఎఫ్టీ క్రియోటర్‌కు వాటా దక్కుతుంది. ఇప్పుడు ఈ ఎన్ఎఫ్టీ జాబితాలోకి బాలీవుడ్ తార సన్నీ లియోన్ అడుగు పెట్టింది. ఈ జాబితాలోకి ప్రవేశించి ఈ ఘనత అందుకున్న భారత తొలి నటిగా గుర్తింపు అందుకుంది. “మిస్ ఫిట్జ్” పేరుతో ఈ ఎన్ఎఫ్టీ తీసుకొని వచ్చింది. ఇందులో 9,600 ఎన్ఎఫ్టీ.లు ఉన్నాయి.
* కాప్-26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సులో పర్యావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారించడంతో రాబోయే కాలంలో కాలుష్యం తగ్గించాలని అన్నీ దేశాలు భావిస్తున్నాయి. ఎక్కువగా పరిశ్రమలు, వాహనాల చేత వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంధనాన్ని మండించడం వల్ల ప్రత్యక్ష కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు పావు వంతు రవాణా రంగం బాధ్యత వహిస్తుంది. అందులో ప్యాసింజర్ కార్లు 45% ఉన్నాయి. ఈ సవాలు నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడే మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది.