తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతిని బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి ఎగిరి తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ నాట ఎంతోమంది అభిమానుల మనసు చూరగొన్న అతడిపై ఆగంతకుడు దాడి చేయడం వెనకాల గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు హాజరవకపోవడంతో ఆగ్రహించిన ఓ కన్నడిగుడు ఇలా చేసి ఉంటాడని మొదట కథనాలు వెలువడ్డాయి. తాజాగా మరో కారణం తెరపైకి వచ్చింది. విజయ్‌పై దాడి చేసిన వ్యక్తి పేరు జాన్సన్ అని, బెంగళూరులో నివాసముండే ఇతడు మలయాళీవాసి అని తెలుస్తోంది. అతడు నటుడితో సెల్ఫీ కోసం ప్రయత్నించగా ఆయన అసిస్టెంట్లు అతడిని అడ్డుకున్నారు. ఇది మనసులో పెట్టుకుని రగిలిపోయాడా వ్యక్తి. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అతడు సెల్ఫీకి నిరాకరించారన్న ఆవేశంతో విజయ్‌ను తన్నాడు. ఈ చర్యతో అప్రమత్తమైన నటుడి సహాయక సిబ్బంది వెంటనే ఆగంతకుడిని పట్టుకున్నారు. అయితే విజయ్ మాత్రం అతడిని ఏమీ అనకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సదరు వ్యక్తి విజయ్ సేతుపతికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం!
విజయ్ సేతుపతిని ఎయిర్‌పోర్టులో ఎగిరి తన్నిన ఆగంతకుడు కారణం చెప్పాడు
Related tags :