DailyDose

ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను-నేరవార్తలు

ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను-నేరవార్తలు

* జవాన్లు పై తోటి జవాన్ కాల్పులు.◆ సుకుమా జిల్లా మారాయి గూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంప్ లో CRPF 50 బెటాలియన్ లోని ఒక CRPF జవాన్ తోటి జవాన్ల్ పై కాల్పులు జరిపారు.◆ ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు .◆ మృత దేహాలను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.

* మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు.పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు.ఏజెన్సీ ప్రాంతాల నుండి మైదాన ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు అన్ని ముఖ్యమైన కూడళ్ళలో 24/7 ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తామన్న ఎస్పీ M.రవీంద్రనాథ్ బాబు.

* మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో పాము కాటుతో మృతి చెందిన 3 నెలల చిన్నారి మృత శిశువు పై ఎమ్మెల్యే శంకర్ నాయక్ పుష్పగుచ్చలుంచి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి తల్లి..తండ్రులను పరామర్శించి చిన్నారి అంత్యక్రియలకు ఆర్ధిక సహాయంను అందజేశారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీనిచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, షూలు , మంత్రులపై కూడా అప్పుడప్పుడు పాములు ఉండే ప్రమాదం ఉంటుందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

* కర్నూలు జిల్లా తుగ్గలి మండలం లో మారెళ్ళ గ్రామానికి చెందిన హుస్సేనపురం సమాచారం ప్రకారం నలుగురిని అరెస్టు చేసి బళ్ళారి కర్ణాటక 50 బాక్సులు తుగ్గలి ఎస్ ఐ ఆధ్వర్యంలో ఎస్ ఐ సమీర్ భాష సిబ్బంది కలిసి సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ లక్షా 60 వేల రూపాయలు కర్ణాటక ముందు ను పట్టుకున్నారు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు