ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ఏపీ, కర్నాటక సరిహద్దు వివాదం తేలేంతవరకూ తనపై ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసుపై దర్యాప్తును నిలిపివేయాలని శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
కేసు విచారణను తొమ్మిదేళ్లుగా సీబీఐ సాగదీస్తుందంటూ శ్రీలక్ష్మి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ వాదించారు.
అదనపు చార్జిషీట్లు దాఖలు చేయాలని సీబీఐ జాప్యం చేస్తుందని లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
శ్రీలక్ష్మి పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో శ్రీలక్ష్మి పిటిషన్ను హైకోర్టు కూడా తోసిపుచ్చింది.