గ్లామర్ పాత్రలతో అలరించిన రకుల్‌ప్రీత్ సింగ్ కొత్తతరహా పాత్రలవైపు అడుగులేస్తోంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛత్రీవాలి’. ఆమె కండోమ్ టెస్టర్‌గా నటిస్తున్న చిత్రమిది. తేజస్ డీయోస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే లక్నోలో మొదలైంది. తాజాగా ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న ఓ అమ్మాయి వేరే దారిలేక కస్టోమ్ టెస్టర్‌గా మారుతుంది. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతూ ఆమె పడిన ఇబ్బందులు నేపథ్యంగా సాగే కథ ఇదని తెలుస్తోంది. సమాజం మాట్లాడుకోవడానికి ఇబ్బందిపడే విషయాల్ని ఈ చిత్రంలో చాలా సున్నితంగా, వినోదాత్మకంగా చర్చించినట్టు చిత్రబృందం చెబుతోంది.
కండోమ్ టెస్టర్…”ఛత్రీవాలి”
Related tags :