* తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరం కాలువ వద్ద ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.
* దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొందరు మానవ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మైనర్ బాలికలు, మహిళలు, వృద్ధులపై పెరుగుతున్న నేరాలను చూస్తే సమాజం దలదించుకులా ఉంది. తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. బీడ్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం పేరుతో ప్రతివాడు పరిచయం చేసుకుని ఆమెను మోసగిస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. కొందరు లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారంకు పాల్పడినట్లు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇవన్నీ బాలిక ఆరోపిస్తుండగా, వరుస అత్యాచారాల కారణంగా గర్భం దాల్చి దిక్కుతోచని స్థితిలో ఉంది. చివరకు శిశు సంక్షేమ శాఖ ను ఆశ్రయించింది ఆ బాలిక. అక్కడి అధికారుల సాయంతో బాలికతో అత్యాచార కేసు నమోదైంది. అయితే ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళితే పోలీసులు కూడా అత్యాచారం చేసినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై బీడ్ జిల్లా ఎస్పీ ఆర్. రాజా మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని అంబేజోగా తాలుకాలో ఓ గ్రామానికి చెందిన బాధితురాలుది నిరుపేద కుటుంబం. ఆ బాలిక తల్లిదండ్రులు రోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. బాలిక పెద్దగా చదువుకోకపోయింది. రెండు సంవత్సరాల కిందట తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. కూతురుని పోషించలేక తండ్రి బాలియకు చిన్న వయసులోనే బాల్య వివాహం జరిపించాడు. చిన్నవయస్సులో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమెకు మామ నుంచి వేధింపులు మొదలయ్యాయి. అంతేకాకుండా భర్త సైతం తండ్రినే సమర్ధించేవాడు. సంవత్సరన్న పాటు అత్తింట్లో కష్టాలు వెళ్లదీసిన ఆ బాలిక.. చివరకు తండ్రి వద్దకు చేరుకుంది. ఖాళీగా ఉండటంతో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కోసం ఆరు నెలల కిందట అంబేజోగై పట్టణానికి చేరుకుంది. అక్కడ ఓ కోచింగ్ సెంటర్లో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు బాలికకు పరిచయం అయ్యారు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ స్నేహితులు కొందరూ ఇదే సాకుతో ఆ బాలిక అత్యాచారం చేశారు. ఇలా గడిచిన ఆరు నెలల కాలంలో దాదాపు 400 మంది అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే బాలిక చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 9 మందిని నిందితులుగా చేర్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇందులో కొందరు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. గర్భంతో ఉన్న బాలిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు అబార్షన్ చేయించేందుకు శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బాలికకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు.
* రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ బిజినెస్మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కపుల్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ప్రారంభించిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి కోటీ 51లక్షల రూపాయలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదిరించారని ఆరోపిస్తున్నాడు ఆ బిజినెస్ మ్యాన్. వ్యాపారవేత్త నితిన్ బరాయ్ ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
* విశాఖ నగరంలో ఉన్మాది దాడి కలకలం రేపింది. ఇక్కడి సూర్యాబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్‌కు తరలించారు. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌రెడ్డి(21), విశాఖ నగరంలోని కరాస ప్రాంతానికి చెందిన యువతి(20) పంజాబ్‌లో కలిసి ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో దిగాడు. తాను వచ్చిన విషయం చెప్పడంతో ఆ యువతి కూడా వచ్చింది. తనను వివాహం చేసుకోవాలని అతను కోరడంతో ఆమె నిరాకరించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆగ్రహం చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటు…తనపై కూడా పెట్రోలు పోసుకున్నాడు. హర్షవర్ధన్‌రెడ్డికి 62శాతం, ఆ యువతికి 61శాతం కాలిన గాయాలయ్యాయి. క్లూస్ టీంతో పోలీసులు సంఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరూ మాట్లాడే పరిస్థితుల్లో లేరని, దర్యాప్తులో పురోగతి వచ్చే వరకూ కచ్చితమైన సమాచారం చెప్పలేమని విశాఖ డీసీపీ-1 గౌతమి సాలి పేర్కొన్నారు. హర్షవర్ధన్‌రెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో నివాసం ఉంటున్నాడు. తండ్రి రాంరెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడు. గతేడాదే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఘటనతో రెడ్డికాలనీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాత్రి విశాఖకు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. చదువులో ముందుండే హర్షవర్ధన్‌రెడ్డి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని కాలనీ వాసులు అంటున్నారు.