Politics

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మాతృవియోగం

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మాతృవియోగం

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాతృముర్తి యార్లగడ్డ రంగనాయకమ్మ (86) మంగళవారం నాడు స్వర్గస్థులైనారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు అంతిమ శ్వాస తీసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలిగా రంగనాయకమ్మ సేవలందించారు. యార్లగడ్డ కుటుంబానికి పలువురు తమ సంతాపాన్ని తెలిపారు.