*** హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్ డయగ్నొస్టిక్స్ సెంటర్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
*** సుధాకర్ కంచర్ల సారధ్యంలో సేవలు ప్రారంభం
హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన డయగ్నొస్టిక్స్ కేంద్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. మెటబోలమిక్స్, ప్రోటియోమిక్స్, మాలిక్యులర్ డయగ్నొస్టిక్ తో పాటు రేడియాలజీ సేవలు కూడా ఒకే చోట అందుబాటులో ఉండే కేంద్రమిది. శరీరానికి వచ్చే అన్ని రకాల ఇబ్బందులను ముందే పసిగట్టే పరికరాలు, ప్రసవ సమయంలో తల్లీ బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలను తెలియజేసే సౌలభ్యం ఉండడం ఈ డయగ్నొస్టిక్స్ సెంటర్ ప్రత్యేకత. సుధాకర్ కంచర్ల సారధ్యంలో సేవలు అందించే ఈ కేంద్రాన్ని ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. సుధాకర్ కంచర్ల ఇదే రంగంలో ఉన్నారు. అమెరికాలో వర్జీనియ, అలబామా, టెక్సాస్ లో ఆయన డయగ్నొస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ సేవలను అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల సర్వీసులను ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో హైదరాబాద్ లో ప్రారంభించినట్లు సుధాకర్ కంచర్ల ఈ సందర్భంగా చెప్పారు. డయగ్నొస్టిక్స్ అవసరాల కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, యోధా ఆ సేవలను అందిస్తుందని తెలిపారు. భవిష్యత్ లో ఇతర మెట్రో పాలిటిన్ నగరాలకూ విస్తరిస్తామన్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అజారుద్దీన్, పుల్లెల గోపీ చంద్, ద్రోణవల్లి హారిక, తదితరులు ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్నారు. సతీష్ వేమన కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు.