కాలిఫోర్నియా రాష్ట్రంలోని సన్నీవేల్‌కు చెందిన ప్రవాసుడు కావూరు కిషోర్‌కుమార్‌కు(46) స్థానిక కోర్టు 15నెలల జైలుశిక్ష విధించింది. 2009-17 మధ్య భారత్ నుండి అక్రమంగా పలువురిని H1B వీసాలపై అమెరికా తీసుకునివచ్చాడనే అభియోగాలు రుజువైనందున ఆయనకు ఈ శిక్ష పడింది. 8ఏళ్ల కాలంలో తనకు చెందిన నాలుగు కన్సల్టన్సీ సంస్థల ద్వారా సుమారు 600మందిని ఉద్యోగం లేనప్పటికీ అమెరికా తీసుకువచ్చి వారికి ఉద్యోగాలు తదనంతర కాలంలో ఏర్పాటు చేయడం ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధమైన కారణంగా ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. 2018లోనే ఇతనిపై ఇమ్మిగ్రేషన్‌తో పాటు, పోస్టల్ అక్రమాల అభియోగాలు నమోదు అయినప్పటికీ తీర్పు మంగళవారం మధ్యాహ్నం నాడు వెలువరించారు. ఈ శిక్ష కారణంగా ఆయన 5లక్షల33వేల డాలర్లు (సుమారు ₹4కోట్లు) కోల్పోవల్సి ఉంటుంది. 15నెలల శిక్ష తదనంతరం మూడేళ్ల పాటు అధికారుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఈ ప్రవాస నిందితుడి జైలు జీవితం మొదలవుతుంది.
More Info: https://www.justice.gov/usao-ndca/pr/sunnyvale-man-sentenced-15-months-visa-fraud