తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన చెన్నుపాటి జగదీశ్ ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. నానో టెక్నాలజీలో ప్రొఫెసర్ జగదీశ్ నిష్ణాతులుగా ఉన్నారు. 2022 మేలో ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. చెన్నుపాటి జగదీశ్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బల్లూరుపాలెం అనే మారుమూల గ్రామం. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివిన జగదీశ్ 1977లో ఆంధ్రా వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. 1988లో దిల్లీ వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆతర్వాత 1990లో ఆస్ట్రేలియాకు వెళ్లి ఆస్ట్రో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ రంగంలో పరిశోధన సంస్థను స్థాపించారు. ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2016లో ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారానికి జగదీశ్‌ను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది.
Australia Academy of Sciences అధ్యక్షుడిగా చెన్నుపాటి జగదీష్
Related tags :