* అమరావతి
రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు, కడప జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు.
రాయలసీమ జిల్లాలను మరోసారి భారీ వానలు ముంచెత్తాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. కడపలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది.
గత వరద నుంచి జిల్లావాసులు కోలుకోక ముందే మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చెరువులన్నీ నిండిపోయి ఉండటంతో. వరదలకు తెగిపోయే ప్రమాదముందని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడప శివారులోని ఊటుకూరు చెరువు తెగిందని వదంతులు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కట్టమట్టి కాస్త జరగడంతో ఇసుక బస్తాలతో పటిష్టం చేశారు. జమ్మలమడుగు ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి.
నెల్లూరు జిల్లా చిల్లకూరులో అత్యధికంగా 15.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాళహస్తి మండలం కండ్రిగుంట చెరువుకు గండి పడింది. చిన్న చెరువు కావడంతో కొంతమేర పంటల నష్టం వాటిల్లింది తప్ప ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
రాయల చెరువు కట్ట పనులను కలెక్టర్ హరినారాయణన్‌తోపాటు జిల్లా ప్రత్యేక అధికారి ప్రద్యుమ్న పరిశీలించారు. చంద్రగిరి మండలంలోని కల్యాణి డ్యాం నీటిమట్టాన్ని సైతం వారు పరిశీలించారు. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రెండు కనుమ దారులను ఆదివారం రాత్రి పదిగంటలకే తితిదే మూసివేసింది.
చిత్తూరు జిల్లాలోని కాళంగి, అరణియార్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. శ్రీకాళహస్తి కైలాసగిరి పర్వతశ్రేణుల్లోంచి రాళ్లు జారిపడుతుండటంతోరాకపోకలను నియంత్రించారు.
ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. రోజంతా రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం కనిపించింది.
* కడప జిల్లా: కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు:
కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు – 08562-246344, 08562-244437
కడప రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్: 08562-295990
రాజంపేట రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్: 08565-240066
* SPS నెల్లూరు జిల్లా:
భారీ వర్షాల కారణంగా జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు – జిల్లా SP విజయ రావు CI-2, SI-3 & సిబ్బందితో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు. Contact నంబర్ 9440796383 & 08612328400
ప్రజలకు ఎటువంటి సహాయమైన 24×7 అందుబాటులో ఉంటారు.
* విశాఖ:
పరవాడ ఫార్మాసిటీ లో గ్యాస్ లీక్ ఇద్దరు మృతి.
* టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాలుగా శ్రీవారి సేవలో తరిస్తూ,ఆయన పాదపద్మాల చెంతనే వున్న శేషాద్రి గారు ధన్యజీవి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
* నెల్లూరు:
సోమశిల జలాశయానికి భారీ గా వచ్చి చేరుతున్న వరద నీరు.
కడప, చిత్తూరు, అనంతపురం నెల్లూరు జిల్లా ల్లో భారీ గా కురుస్తున్న వర్షం.
జలాశయం ఎగువ ప్రాంతాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, ఉపనదులు
జలాశయానికి 96 వేల క్యూసెక్కులు వచ్చి వరద నీరు
ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్ల ద్వారా లక్షా 16 వేల క్యూసెక్కులను పెన్నానదికి విడుదల చేసిన అధికారులు
ప్రస్తుతం జలాశయం లో 68టీఎంసీ నీరు నిల్వ.
కలువాయి చెరువు అలుగులు గుండా ఉదృతం గా ప్రవహిస్తున్న వరద నీరు..
పంట పొలాల పై ప్రవహిస్తున్న వరద నీరు.
నీట మునిగిన వరి నారు మడులు, సంపగి పువ్వుల తోటలు.
* అనంతపురం:
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త పరిణామం.
అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ను కలిసిన గంగాధర్ రెడ్డి.
సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు.
తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరిన బాధితుడు గంగాధర్ రెడ్డి.
10 కోట్ల ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందన్న గంగాధర్ రెడ్డి.
వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లు.
వారి ఒత్తిడి తో తానే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశారు.
వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేదు.
లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేదిలేదు- గంగాధర్ రెడ్డి.
అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప కామెంట్స్.
వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
గంగాధర్ రెడ్డి కి రక్షణ కల్పిస్తాం.
సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశారు.
డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తాం.
తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెబుతున్నారు.
గంగాధర్ రెడ్డి ఫిర్యాదు లోని అన్ని అంశాలపై విచారణ చేస్తాం.
* వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదు : చంద్రబాబు నాయుడు
అమరావతి :
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో ఇవాళ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక విషయాలతో పాటు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై కూడా నిశితంగా చర్చించారు. అనంతరం ఈ భేటీకి సంబంధించి టీడీపీ కార్యాయలం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదలతో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యానించడం చేతగానితనమేనని బాబు విమర్శలు గుప్పించారు. ఫ్లడ్ మేనేజ్ మెంట్‌లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని. దీనిపై కచ్చితంగా న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు. వరద బాధితులకు ఇంతవరకూ ఎలాంటి నష్ట పరిహారం అందలేదని. ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సీడీని కూడా తగ్గించారన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని బాబు ఆరోపించారు. వరి వేయవద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు.
* మేం అధికారంలోకి వచ్చాక ‘పంట బీమా ప్రీమియం కట్టకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొంది. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి వచ్చింది. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారు. ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలి. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరూ కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తాం. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ సభను జగన్ రెడ్డి కౌరవ సభగా మార్చారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి. మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చిస్తాం. సీఎఫ్ఎంఎస్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయకుండా నిధులు పక్కదారి పట్టించారు’ అని చంద్రబాబు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీల నిధుల్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో డిపాజిట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడాన్ని టీడీపీ నేతలు ఖండించారు.
ఇది దుర్మార్గపు చర్యే ‘చట్ట వ్యతిరేకమైన నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలి. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీల నిధుల మళ్లింపు విద్యావ్యవస్థ ప్రమాణాల్ని దిగజార్చుతుంది. అభయ హస్తం పధకాన్నీ జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. డ్వాక్రా మహిళలు ఎల్ ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారు. ఎల్ఐసీని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గపు చర్య. ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం తెలపాలి. ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి’ అని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సూచించారు. అక్కడే విఫలం పోటీ పడం ‘సమర్థంగా పనిచేసిన నేతలకు భవిష్యత్‌లో తగిన ప్రాధాన్యత ఉంటుంది. ఫేక్ ఓట్లు తొలగింపుపై పార్టీ నేతలు కృషి చేయాలి. 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంపై అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి జగన్ రెడ్డి లబ్ధి పొందారు. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇప్పుడు అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి అణచివేతను బలంగా తిప్పికొట్టాలి. జగన్ రెడ్డి విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది. భవిష్యత్‌లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఉన్మాదంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను కాలరాస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. చివరిగా అసెంబ్లీ ఘటన గురించి ప్రస్తావన రాగా.. వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదని.. అధికార పార్టీ తీరును క్షేతస్థాయిలో ఎండగట్టాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు.
* జగన్ తీరు అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటోంది చంద్రబాబు
అమరావతి:
ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయినవారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వరదల్లో అధికార యంత్రాంగం వైఫల్యంపై న్యాయవిచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు. బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారిమళ్లించారని ఆరోపించారు. వరి వేయొద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి మహిళల పట్ల వైకాపా వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజాసమస్యలు చర్చిస్తామన్నారు. డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను స్వాహా చేశారని చంద్రబాబు ఆరోపించారు. చట్ట వ్యతిరేక నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింటోందన్నారు.
* హైదరాబాద్: ఒమిక్రాన్ పుట్టిన దేశం దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు రావడం మారింది.
ఈ నెల 25, 26, 27 తేదీల్లో వారంతా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. అలాగే అదే వేరియంట్‌తో గజగజ వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు.
వీరితోపాటు కరోనా కొత్త వేరియెంట్ కేసులున్న 12 దేశాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చారు. వచ్చినవారందరికీ ఆసుపత్రిలోని ప్రత్యేక బృందాలు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేశాయి. ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే ప్రయాణికుల రక్త నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు తెలిసింది. అక్కడ ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తారు. ఆ పరీక్షలో అది ఏ వేరియంటో నిర్ధారిస్తారు. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ మూడు రోజుల్లో 57 దేశాల ప్రయాణికులు వచ్చారు.
* రాజ్యసభలో 12మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు!
దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
సస్పెండ్ అయిన 12మంది సభ్యులు వీరే.
ఫూలోదేవి నేతం (కాంగ్రెస్), ఛాయా వర్మ (కాంగ్రెస్), రిపున్ బోరా (కాంగ్రెస్), రాజామణి పటేల్ (కాంగ్రెస్), అఖిలేశ్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్), సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్), డోలా సేన్ (తృణమూల్), శాంతా ఛత్రీ (తృణమూల్), ప్రియాంకా చతుర్వేది (శివసేన), అనిల్ దేశాయ్.
* తెలంగాణ వరంగల్ ముంబై కేంద్రంగా సాగే ఆన్ లైన్ బెట్టింగ్ దందా. ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు బుకీగా ప్రసాద్ అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్ సైట్ ద్వారా నిందితుడు ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమించబడ్డాడు. దీనితో ఆన్లైన్ లో బెట్టింగ్ లో పాల్గొనేవారు ముందుగా అన్లైన్ ద్వారా గాని, వ్యక్తిగతంగా కానీ డబ్బు చెల్లించిన వ్యక్తులకు అభయ్ నుండి నిందితుడు ప్రసాద్ కు వచ్చిన యూజర్ నేమ్, పాస్ వర్డ్ లను, వాట్సప్ ద్వారా బెట్టింగ్ లో పాల్గొనే వ్యక్తులకు అందజేసేవాడు. వీటి ద్వారా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ లలో పాల్గొనేవారు.