Business

TNI నేటి వాణిజ్యం వార్తలు తెరచుకుంటున్న సినిమా థియేటర్లు

TNI నేటి వాణిజ్యం వార్తలు తెరచుకుంటున్న సినిమా థియేటర్లు

సుదీర్ఘ విరామం అనంతరం విజయవాడలో సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచు కుంటున్నాయి. బస్టాండ్ లోని వై స్క్రీన్స్ రెండేళ్ల తరువాత శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభించడానికి సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ఈ స్క్రీన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వై స్క్రీన్ అధినేత యార్లగడ్డ రత్నకుమార్ తెలిపారు.

కోవిడ్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు రెండేళ్ల పాటు అన్ని రంగాలు మూటపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. కోవిడ్ తొలిదశ తరువాత సినిమా హాళ్లు తిరిగి ప్రారంభం అయ్యేలోపు రెండో విడత కోవిడ్ విజృంభించడంతో ఇప్పటి వరకు థియేటర్లు తెరుచుకోలేదు. నెల రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలతో 100శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా హాళ్లు తెరుచుకోగా మరికొన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభానికి సిద్ధమయ్యాయి. విజయవాడ బస్టాండ్ లోని వై స్క్రీన్స్ గురువారం నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ అకాల మరణంతో ఆయన నివాళిగా ఒక రోజు అనంతరం శుక్రవారం నుంచి థియేటర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు సంస్థ అధినేత యార్లగడ్డ రత్నకుమార్ తెలిపారు.