జీఎస్కే కన్జ్యూమర్స్ హెల్త్‌కేర్‌ను హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్‌లో విలీనం చేయడానికి వాటాదారులు అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని జీఎస్కే సీహెచ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. దీనికి అనుకూలంగా 99.99శాతం ఓట్లు వచ్చాయి. దీనికి సంబంధించి జూన్1న ఓటింగ్ నిర్వహించారు. ఈ విషయాన్ని బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. డిసెంబర్ 2018లో ఆంగ్లో డచ్ కంపెనీ యూనీలీవర్ గ్లాక్సోకు చెందిన ఆరోగ్య, ఆహార విభాగాన్ని విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్‌కు సంబంధించి సీసీఐ అనుమతి లభించినట్లు గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్ జనవరిలోనే వెల్లడించింది. దీంతో హార్లిక్స్, బూస్ట్ వంట్రి ప్రముఖ బ్రాండ్లను యూనీలీవర్ భారతీయ విభాగం హెచ్‌యూఎల్ చేతికి వెళ్లాయి. వీటివిలువ రూ.27,750 కోట్లుగా అంచనా వేశారు.
హిందూస్థాన్ యూనీలివర్ చేతికి హార్లిక్స్-బుస్ట్
Related tags :