తమిళ కథానాయకుడు శింబు ఆస్పత్రిలో చేరారు. తీవ్ర వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గౌతమ్ మేనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త చిత్రం ‘వెందు తనిందదు కాడు’ షూటింగ్‌లో కొన్ని వారాల పాటు బిజీగా ఉన్న శింబుకు నిన్న తీవ్ర జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే, ఇది మామూలు ఇన్ఫెక్షనేనని, కొవిడ్ కాదని వైద్యులు తెలిపినట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. శింబు ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియడంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తెలుగులోనూ ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి ప్రేమకథా చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల్లో శింబు మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.