ScienceAndTech

పాతబస్తీ మహిళకు యాండ్రాయిడ్ యాప్‌లో మోసం

Hyderabad lady cheated via android app for 1.5Lakh INR using fake customer care number

గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ కు ఫోన్ చేసిన ఓ మహిళకు సైబర్‌ చీటర్లు ఎనీడెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సూచించి ఆమె ఖాతాలో నుంచి రూ.1.5లక్షలు కాజేశారు.

చాదర్‌ఘాట్‌కు చెందిన నజియా తన సెల్ ఫోన్‌లో ఉన్న జీపే యాప్‌ను ఉపయోగించే సమయంలో సమస్య వచ్చింది.

ఆ సమస్య పరిష్కారం కోసం గూగుల్‌లో గూగుల్ పే(జీ-పే) యాప్ కస్టమర్ కేర్ నంబర్‌ను సర్చ్ చేసింది.

ఆ సమయంలో గూగుల్ పే కస్టమర్(6289926472) నంబర్ అంటూ ఒకటి కన్పించడంతో ఆమె ఆ నంబర్‌కు ఫోన్ చేసింది.

ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు.

దీంతో ఆమె ఆ యాప్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంది.

డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలు అందులో పొందుపర్చాలంటూ.. సూచనలు చేస్తూ వెళ్లడంతో ఆమె వాటిని అనుసరిస్తూ వెళ్లింది.

ఈ క్రమంలోనే ఆమె సెల్ ఫోన్‌కు ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి.

ఇలా రెండు రోజుల వ్యవధిలో ఆమె ఖాతాలో నుంచి రూ.1,50,933 ఖాళీ అయ్యాయి.

దీంతో బాధితురాలు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.