యూకేకి చెందిన ఒక మహిళ ఒక విన్నూతమైన పనికి శ్రీకారం చుట్టింది. అసలు విషయంలోకెళ్లితే…యూకేలో మెర్సీసైడ్‌లోని సెఫ్టన్‌లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్‌హామ్ అనే మహిళ 2019లో చాలా ఏళ్ల నాటి పెద్ద వృక్షాన్ని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తన ఇంటిపేరును ఎల్డర్‌గా మార్చుకుంది. పైగా వారానికి ఐదు సార్లు చెట్టును సందర్శిస్తానని కూడా చెబుతుంది. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులందర్నీ ఇంట్లో వదిలి బాక్సింగ్ డేని తన బెటర్ హాఫ్‌తో గడపాలని ప్లాన్ చేసుకుంటుందట. అయితే రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా కేట్ ఆ పార్క్‌లోని ఆ మహా వృక్షాన్ని వివాహం చేసుకుంది. అంతేకాదు చాలా ఏళ్ల క్రితం ల్యాండ్ క్లియరెన్స్ కోసం చట్టవిరుద్ధంగా చెట్టను నరకడాన్ని వ్యతిరేకించి చెట్లను వివాహం చేసుకున్న మెక్సికన్ మహిళలు తనకు ఆదర్శం అని కేట్ చెప్పింది. పైగా తాను పెళ్లి చేసుకోవాలనుకునే చెట్టుని వెతకడానికే ఆ పార్క్‌ని సందర్శించానని కూడా చెబుతోంది. అంతేకాదు కేట్ ఆ చెట్టుతో కలిసి మూడో క్రిస్మస్ని జరుపుకోనున్నట్లు చెప్పింది. ఈ మేరకు కేట్ పండుగ కోసం చెట్టును పుష్పగుచ్ఛం, టిన్సెల్, బాబుల్స్‌తో కూడా అలంకరించింది. పైగా కేట్ తన క్రిస్మస్ కార్డులపై ‘విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్’ అని సంతకాలు కూడా చేసింది. కేట్ కుటుంబ సభ్యులు స్నేహితులు ఆమె వివాహానికి పూర్తిగా మద్ధతు ఇవ్వడం విశేషం.
చెట్టును పెళ్లి చేసుకున్న యూకె మహిళ
