స్వర్గీయ డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి 1995లో అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో సిన్సినాటిలో డాక్టర్ రామినేని ఫౌండేషన్ను స్థాపించారు. భారతీయ సంస్క్రతి, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాపితం చేయడం కోసం ఫౌండేషన్ పనిచేస్తోంది అని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారఖ్ పేర్కొన్నారు. గత 22సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా తెలుగు ప్రముఖులకు అవార్డులను ఇస్తూ వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెపుతోంది. దీనిలో భాగంగా 22వ అవార్డుల ప్రదానోత్సవాన్ని, వచ్చే గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కళలు, విద్యా, క్రీడా, సాంకేతిక తదితర రంగాల్లోని ప్రతిభావంతులకు ఈ పురస్కారాలను ప్రతి ఏటా అందజేస్తున్నామని రామినేని ఫౌండేషన్ ఇండియా కన్వినర్ పాతూరి నాగభూషణం వివరించారు. ఈ ఏడాది నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీ.ఆర్ చింతల, ప్రముఖ నటుడు దాత. సోనుసూద్, ప్రముఖ యాంకర్ సుమ, ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. మస్తాన్ యాదవ్, షిర్డికి చెందిన ద్వారకామాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు బండ్లమూడి శ్రీనివాసులకు కు విశిష్ట పురస్కారాలను అందజేస్తున్నట్లు పాతూరి నాగభూషణం తెలిపారు. వీరితో పాటు భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు ఎల్లా కృష్ణ , సుచిత్ర ఎల్లా దంపతులకు, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం కు, NIMS వైద్యురాలు డాక్టర్ దుర్గా పద్మజకు , సినీ జర్నలిస్ట్ ఎస్వీ రామారావు కు విశిష్ట పురస్కారాలను అందజేస్తున్నట్లు పాతూరి నాగభూషణం తెలిపారు.
ఇప్పటి వరకు రామినేని పురస్కారాలు అందుకున్న ప్రముఖుల్లో DRDO ఛైర్మన్ డా.జీ.సతీష్ రెడ్డి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, నటుడు కైకాల సత్యనారాయణ, నటి శారద, గాయకుడు గద్దర్, కోచ్ పుల్లెల గోపీచంద్, మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు, సినీ దర్శకుడు నాగ్అశ్విన్రెడ్డి, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, బాలసాహిత్య వికాసానికి కృషి చేసిన చొక్కపు వెంకటరమణ, తదితరులతో పాటు వేలమంది విద్యార్థులు, గురువులు ఉన్నారు.
స్థాపించిన నాటి నుండి డా.రామినేని ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి పురస్కారాల గురించి ఈ దిగువ బ్రోచరులో వివరాలు చూడవచ్చు….
కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్