డిసెంబర్ నెలలో కర్నూలు నగరం నుండి శబరిమల యాత్రకు బయలుదేరి గమ్యం చేరుకునేలోపు కేరళ రాష్ట్రంలోని శివకోయిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు నగరానికి చెందిన ఆదినారాయణ కుటుంబానికి ఎన్నారైలు రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ఈ విరాళాల సేకరణను సమన్వయపరిచారు. సోమవారం నాడు కర్నూలు సిటీ డీఎస్పీ కేవీ మహేష్ ద్వారా ఆదినారాయణ కుమార్తె రేఖకు ఈ మొత్తాన్ని అందించారు. ఆదినారాయణ కుటుంబానికి అండగా ఉంటామని, రేఖ విద్యావసరాలకు సహకారం అందిస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ తెలిపారు. సీఐ తబరేజ్, సందడి మధు, జంపాల అమిత్, నంది మధు, మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు.