ScienceAndTech

ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ నియామకం – నేటి తాజా వార్తలు

ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ నియామకం – నేటి తాజా వార్తలు

*రాష్ట్రంలోని యువజనులందరికీ సీఎం జగన్ విరోధి అని కాంగ్రెస్ నేత తులసీరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. యువజన సంక్షేమానికి బడ్జెట్లో అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల పదవీ విరమణను 62 ఏళ్లకు పెంచి సీఎం జగన్ నిరుద్యోగ యువతకు తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని జగన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

*తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ నునిలుపుదల చేసినట్లు వెల్లడించింది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారానికి భారత ఎన్నికల సంఘం ఈమేరకు రాత పూర్వకంగా సమాధానమిచ్చినట్లు ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ మీడియాకు తెలిపారు.

*తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ. సంక్రాంతి పండుగలో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్న జిల్లా పోలీసులు. పటిష్టమైన వ్యూహం మరియు సమాచారంతో కోడిపందాల బరులను ధ్వంసం చేస్తున్న స్థానిక పోలీసు బృందాలు.SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., ఆదేశాలతో క్షేత్ర స్థాయిలో స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసుల సమన్వయంతో బరులను గుర్తించి రెవిన్యూ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్న పోలీసులు.

*నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం ముత్తరాసుపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడ్డ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి, భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే యోగి కేబినెట్లో మరొక వికెట్ పడింది. మంత్రి దారా సింగ్ చౌహాన్ తన మంత్రి పదవికి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. యోగి కేబినెట్ నుంచి తప్పుకున్న ఇరువురు నేతలూ ఓబీసీ వర్గానికే చెందినవారు కావడం గమనార్హం. వచ్చే నెలలోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండడంతో బీజేపీకి ఇది పెద్ద ఎదురు దెబ్బ అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

*ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎరువుల ధరలను తగ్గించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ధరల భారాన్ని రైతులపై మోపేందుకు ప్రభుత్వం ఎంచుకుందని, పెట్రో ధరల పెరుగుదల రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రకటించారని, అమలులో మాత్రం రైతాంగం నడ్డి విరుస్తున్నారని లేఖలో కేసీఆర్ విమర్శించారు.

*సీఎం జగన్ అసమర్థ పాలన కారణంగా ఏపీలో సంక్రాంతి పండుగ కళ తప్పిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నగరంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలను పేదలకు అందించామన్నారు. అయితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పండుగలకు పేదలకు కానుకలు అందించలేకపోతోందని ఆయన ఆరోపించారు. జగన్రెడ్డి 36 నెలల పరిపాలనలో 3.86 లక్షల కోట్ల అప్పును చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ డబ్బును ఏ సంక్షేమ పథకాలకు ఎంతెంత ఖర్చు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాడ్ చేశారు.

* భారత్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల నుంచి సిద్ధార్థ్ తీరుపై విమర్శలు రావడంతో సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సిద్ధార్థ్పై కేసు నమోదైంది. సైనా నెహ్వాల్పై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బంజారాహిల్స్కు చెందిన ప్రేరణ తిరువాయిపట్టి అనే మహిళ సిద్ధార్థ్పై ఫిర్యాదు చేసింది. ప్రేరణ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 67 సైబర్ యాక్ట్, ఐపీసీ 509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

* ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సోమనాథ్ జీఎస్ఎల్వీ ఎంకే-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత (జనవరి 12, 2022) ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు.