Movies

ముంబాయి ముద్దుగుమ్మలతో…

Mumbai Actress Flooding Tollywood

తెలుగు వెండితెరపై బాలీవుడ్‌ హీరోయిన్లు చాలామంది మెరిశారు. కొందరైతే సౌత్‌లోనే సెటిలైపోయారు. అలా ఈ ఏడాది కూడా కొందరు బాలీవుడ్‌ భామలు తెలుగు ఇండస్ట్రీలో కథానాయికలుగా తమ ప్రస్థానాన్ని స్టార్ట్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న వన్నాఫ్‌ ది టాప్‌ హీరోయిన్స్‌ శ్రద్ధాకపూర్‌. ఈమె ‘సాహో’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరో బాలీవుడ్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం.ఆలియా భట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్నారు. మరో హిందీ తార జరీనా ఖాన్‌ కూడా తెలుగు ఆడియన్స్‌కు తనను తాను పరిచయం చేసుకోబోతున్నారు. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జరీన్‌ ఖాన్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెహరీన్‌ మెయిన్‌ హీరోయిన్‌. అలాగే ‘ఎర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పి’ సినిమా దిగంగనా సూర్యవన్షీకు హీరోయిన్‌గా టాలీవుడ్‌ తలుపులు తెరుచుకున్నాయి.