* జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆదివారం శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన గాంధీజీ సిద్ధాంతాలు,స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి, శాసన వ్యవహారాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఇన్ కౌన్సిల్ ఎంఎస్ ప్రభాకర్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
*నియోగదారులు ఆన్ లైన్ లో సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ అవుతుంది.దాని ఆధారంగా డిస్టిబ్యూటర్లు వారి సిబ్బందితో డెలివరీ చేయాల్సి ఉంటుందిడిస్ట్రిబ్యూటర్ తమ గోదాము నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా డెలివరీ చేయాలి. 6-15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా ఛార్జీలకు రూ.10 వసూలు చేయాలి.16-30 కిలోమీటర్ల దూరం ఉంటే రూ.15 తీసుకోవాలి.ఒకవేళ వినియోగదారుడు గ్యాస్ గోదాముకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుందిసిలిండర్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాల్సి ఉంటుంది
*ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 39,296 నమూనాలను పరీక్షించగా, కొత్తగా 10,310 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి కారణంగా మరో 12 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా బారినుంచి 9,692 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది.
* టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలను సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాల పై కూడా కేసీఆర్ ఎంపీలతో చర్చిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలనుకూడా చర్చిస్తున్నారు
* వరంగల్ నగరానికి ప్రతీకగా వున్న భద్రకాళీ అమ్మవారి దేవాలయ పరిసరాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే భద్రకాళీ బండ్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. శనివారం రాత్రి మంత్రులు భద్రకాళీ అలయ పరిసరాలను పరిశీలించారు. అలాగే బండ్ పై జరుగుతున్న పనులనుకూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బండ్ పై కలియ తిరిగి సందర్శకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు.
* ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలతో పాటు మరే ఇతర వేదికలపైనైనా ఈ రెండు తేదీల మధ్య ఎగ్జిట్ పోల్స్ ప్రదర్శన నిషేదించినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఈసీ తెలిపింది.
*కొవిడ్ నిబంధనలు తొలగించిన మేరకు మేకెదాటు పాదయాత్రను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్ వెల్లడించారు. శనివారం ఆయన రామనగరలో మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 20 నుంచి పాదయాత్ర ఆగిన చోటు నుంచి శ్రీకారం చుడతామన్నారు. బెంగళూరులో ముగింపు ఉంటుందన్నారు. రెండోవిడత యాత్రకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. కొవిడ్ నిబంధల పేరిట తొలి విడత యాత్రకు ఆటంకం కలిగించారన్నారు. మేకెదాటు నిర్మాణాలు పూర్తయితే బెంగళూరుతోపాటు అనుబంధంగా ఉండే వేలాది గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు సాధ్యమవుతుందన్నారు. కర్ణాటక కోటాలోని నీటిని వాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఇదే సందర్భంలో జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొందరు అసత్యాలను ఇంటి దేవుడిగా చేసుకున్నారని విమర్శించారు.
* ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60నుంచి 62ఏళ్లకు పొడిగించిన ప్రభుత్వం దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న జరిగిన కేబినెట్‌లో ఆమోదించిన ముసాయిదా ఆర్డినెన్స్‌ను న్యాయశాఖ పరిశీలన అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఆ ముసాయిదా ప్రతి శనివారం రాజ్‌భవన్‌కు చేరింది.
* తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారి సంకల్ప దీక్ష జరగనుంది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు. అనిత పిలుపు మేరకు నారీ సంకల్ప దీక్షకు పెద్ద ఎత్తున మహిళలు హాజరు కానున్నారు.
* వరంగల్ నగరానికి ప్రతీకగా వున్న భద్రకాళీ అమ్మవారి దేవాలయ పరిసరాలను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నట్టు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందులో భాగంగానే భద్రకాళీ బండ్ ను పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు. శనివారం రాత్రి మంత్రులు భద్రకాళీ అలయ పరిసరాలను పరిశీలించారు. అలాగే బండ్ పై జరుగుతున్న పనులనుకూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు బండ్ పై కలియ తిరిగి సందర్శకుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు.
* కొవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని కెనడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను ఫాసిజంతో పోలుస్తూ వేలాది మంది ట్రక్కులతో ఒట్టావాలోని పార్లమెంట్ భవన్‌కు బయలుదేరారు. దీంతో చేసేదేమీ లేక కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన కుటుంబంతో కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రధాని రహస్య ప్రదేశం గురించి ఎలాంటి సమాచారమైనా వెల్లడించడం కుదరదని కెనడా ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు.
* భీమడోలు ఎంపీడీవో శ్రీనివాస్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేశారు. పెదవేగి ఎంపీడీవోగా పనిచేస్తున్న సమయంలో రూ. 22 లక్షలు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. ఫిర్యాదుపై విచారణ చేసిన కలెక్టర్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.