ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆయన అకౌంట్లకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. యూట్యూబ్‌లో ఆయన చానల్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఓ కోటి దాటింది. అమెరికా, బ్రెజిల్, మెక్సికో దేశాల అధ్యక్షుల యూట్యూబ్ చానళ్ళ సబ్‌స్క్రైబర్ల కన్నా మోదీ యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నారు. యూట్యూబ్ చానళ్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పరిశీలించినపుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు దాదాపు 7.3 లక్షల మంది, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు దాదాపు 36 లక్షల మంది, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్‌కు 30.7 లక్షల మంది, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు 28.8 లక్షల మంది, వైట్ హౌస్‌కు 19 లక్షల మంది ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది, ఆ పార్టీ నేత శశి థరూర్‌కు 4.39 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.