ScienceAndTech

అబ్బాయిలు మొల‌తాడు ఎందుకు ధ‌రిస్తారో తెలుసా?

అబ్బాయిలు మొల‌తాడు ఎందుకు ధ‌రిస్తారో తెలుసా?

చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. వాటిని ఎలా తెలుసుకోవాలో తెలియదు. వాటి గురించే గూగుల్ లో సెర్చ్ చేస్తారు. కానీ అవి మ‌న‌కు క‌నిపించ‌వు. ఇప్పుడు అలాంటి ఒక చిన్నడౌట్ గురించి చూద్దం. అబ్బాయిలు కొంత మంది న‌డుముకు మొల‌తాడు ధ‌రిస్తారు. అసలు మొల‌తాడు ఎందుకు ధ‌రిస్తారో చాలా మందికి తెలియ‌దు. మొల‌తాడు ధ‌రించ‌డం వ‌ల్ల ఆధ్యాత్మికం గా.. సైన్స్ ప‌రం గా అనేక లాభాలు ఉంటాయి. అందులో ఒక‌టి పూర్వ కాలం లో డాక్ట‌ర్లు ఉండ‌రు. కాబ‌ట్టి ఎవ‌రి కైనా.. పాము, తేలు వంటి కుట్టిన స‌మ‌యం లో ఈ మొల‌తాడు తో కుట్టిన ప్ర‌దేశం గ‌ట్టిగా క‌ట్టి.. విషం తో కూడిన ర‌క్తాన్ని తీసేవారు. అలాగే గాయాలు అయిన స‌మ‌యం లో మొల‌తాడు తో క‌ట్టే వారు. అలాగే ఆధ్య‌త్మికం గా మొల‌తాడు క‌ట్టు కోవ‌డం వ‌ల్ల ఎలాంటి దిష్టి మ‌న‌కు త‌గ‌ల‌దు. అందుకే అప్పుడు మొల‌తాడు న‌డుము కడుతున్నారు. ప్ర‌స్తుతం దిష్టి విష‌యం లో కాలుకు చేతికి కూడా న‌ల్లటి దారం క‌డుతున్నారు. మొల‌తాడు న‌డుముకు ధ‌రించ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంద‌ని.. బ‌రువు కూడా అదుపు లో ఉంటుంద‌ని ప‌లు సైన్స్ అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అలాగే హెర్నియా అనే వ్యాధి రాకుండా ఉండ‌టానికి కూడా మొల‌తాడు ను క‌ట్టుకోవాల‌ని ప‌లువురు సూచిస్తారు. కొన్ని ప్రాంతాల‌లో మొల‌తాడు క‌ట్టు కోవ‌డం వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాలు ఆరోగ్యం గా ఉంటాయ‌ని న‌మ్ముతారు. అందుకే ఆ ప్రాంతాల‌లో ప‌రుషుల‌తో పాటు మ‌హిళ లు కూడా మొలతాడు ను క‌ట్టుకుంటారు. అలాగే గ‌తం లో బెల్ట్ వాడ‌కం లేక‌పోవ‌డం తో ధ‌రించిన వ‌స్తాలు ఆగ‌టానికి మొల‌తాడు క‌ట్టుకునే వారు. మ‌రి కొంత మందికి జాతకం దృష్ట్య దోషాలు ఉన్న స‌మ‌యంలో తాయ‌త్తులు క‌డుతారు. ఆ తాయ‌త్తులు క‌నిపించ‌కుడ‌దు. కాబ‌ట్టి న‌డముకు మొల‌తాడు క‌ట్టి దానికి తాయ‌త్తు క‌ట్టేవారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా కార‌ణాలు ఉన్నాయి. అందుకే ఇప్ప‌టి కీ కూడా అబ్బాయిలు మొల‌తాడు క‌ట్టుకుంటారు.