జాక్సన్‌విల్ తెలుగు సంఘం 2022 సంక్రాంతి వేడుకలు శనివారం నాడు బోల్స్ మిడిల్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు మిట్టపల్లి సురేష్ స్వాగతోపన్యాసం చేసి, సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ముగ్గుల పోటీలు, నాటకాలు, సాంప్రదాయ దుస్తుల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుక విజయవంతానికి శ్రీదేవి, శ్యామల, సాయి, భవాని, నారాయణ, RK, సునీల్, విజయ్, మల్లి, మహేష్, సుమన్, అనీల్, రాజేష్, శ్రీధర్, శేఖర్, కృష్ణ, ధీరజ్, పాపారావు, శృతిక, కావ్య, సమత, దీప్తి, పద్మ, సత్యదీప్ తదితరులు తోడ్పడ్డారు.