Movies

ఆ సమయంలో చాలా భయం వేసింది

ఆ సమయంలో చాలా భయం వేసింది

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. అనంతరం హలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ కూడా మంచి గుర్తింపునే సాధించింది. అయితే 2019లో ప్రియాంక తన ఆత్మకథ ‘అన్‌ఫినిష్డ్: ఏ మెమోరీ’ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ పుస్తకంగా రాస్తున్నట్లు 2018లో ఈ భామ ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత బుక్‌ని పబ్లిష్ చేసింది. ఈ బ్యూటీ ఈ పుస్తకం రాసేటప్పుడు తన మదిలో మెదిలిన కొన్ని ఆలోచనల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ. ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఈ బుక్ రాస్తున్నప్పుడు ఎంతో భయంగా అనిపించింది. దీన్ని రాయలేనని చాలాసార్లు అనుకున్నా. నిజానికి నా ఇంటర్వ్యూలలో చెప్పని విషయాలను సైతం ఇందులో చెప్పాలని నిర్ణయించుకున్నా. ఎవరికీ తెలియని కొత్త సంగతులు ఇందులో పంచుకోవాలనుకున్నా. కానీ ఆ సమయంలో వచ్చే కొన్ని ఆలోచనలు ఎంతో భయాన్ని కలిగించేవి’ అని తెలిపింది. అంతేకాకుండా.. ‘ఈ బుక్ రాస్తున్నప్పుడు ఈ పుస్తకం చదివిన అందరికీ నా భయాలు, బలహీనతలు, ఫెయిల్యూర్స్ తెలిసిపోతాయని భయపడ్డా. ఇవి నా పబ్లిక్ లైఫ్‌లో ఎప్పుడూ ఒప్పుకోని విషయాలు. ఎందుకంటే, ఒక మహిళగా అందరికి మీ బలాలు మాత్రమే తెలుపుతారు. ప్రశాంతంగా బతకడానికి కొన్నింటినీ దాయాల్సి వస్తుంది. కానీ ఒక నటిగా, పబ్లిక్ ఫిగర్‌గా ఇలా చేయడం అంత సులభమైన విషయం కాదు’ అని చెప్పింది. కాగా.. ప్రియాంక బుక్ విడుదలైన కొన్ని రోజుల్లోనే న్యూయార్స్ టైమ్స్‌లోనే బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.