రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ చలో విజయవాడ వైపే.. విజయవాడలో రహదారులన్నీ బీఆర్టీఎస్ రోడ్ల వైపే.. ఒక్కసారిగా ఉద్యోగులు ఉప్పెనలా తరలిరావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. బీఆర్టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి అగ్రభాగాన పీఆర్సీ సమితి ముఖ్య నేతలు నిలిచారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఛేదించుకుని మరీ ఉద్యోగులు దూసుకెళ్లారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 200 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమని వెంటనే విడుదల చేయాలంటూ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు నినాదాలు చేశారు. విజయవాడ నగరం వెలుపలే వేలాది మంది ఉద్యోగులను పోలీసులు నిలిపివేశారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు. తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారు.. తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఉన్నాను… నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్ అన్నారు: ఉద్యోగులు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణం. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారు. నిరంకుశంగా చలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నాం. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడం. సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్లో కాదు… అణచివేత తగదు. ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ ఆవేదన బీఆర్టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే బైఠాయింపు.