అమెరికాలో 12 రాష్ట్రాలు మంచు తుపాను ధాటికి విలవిల్లాడుతున్నాయి. న్యూమెక్సికో నుంచి ఇలినాయిస్ వరకు మంచు విపరీతంగా కురుస్తోంది. ఇప్పటికే 1300కు పైగా విమానాలు రద్దయ్యాయి. మిడ్వెస్ట్, దక్షిణ ప్రాంతవ్యాప్తంగా యామ్ట్రాక్ తన రైలు సర్వీసులను రద్దు చేసింది. అతిశీతల గాలులతో పాటు భారీ మంచు, వర్షం అమెరికా రాష్ట్రాలను చుట్టుముట్టేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. న్యూమెక్సికోలో పలు ప్రాంతాల్లో 14 అంగుళాల మేర(36 సెంటీమీటర్లు) మంచు కురవొచ్చని తెలిపింది. కొలరాడో, కన్సా్సలో కూడా ఇదే పరిస్థితి. షికాగోలో బుధవారం ఉదయం 2 అంగుళాల మేర మంచు కురిసింది. తుపాను హెచ్చరికలతో ఇలినాయిస్, మిస్సోరి, ఓక్లహామా గవర్నర్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇళ్ల నుంచి రావొద్దని ప్రజలను పలు రాష్ట్రాల గవర్నర్లు కోరారు.