హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ మంచు కురుస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా, స్పితి, కులూ, సిమ్లా వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తుందని ఐఎండీ ప్రాంతీయ కార్యాలయం అధిపతి సురేందర్ పాల్ చెప్పారు. ఫిబ్రవరిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుందని, పంజాబ్, హర్యానాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తన వెదర్ రిపోర్టులో తెలిపింది.ద్వీపకల్ప భారతదేశంలోని తూర్పు, నైరుతి తీర ప్రాంతాల్లో మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.వచ్చే 48 గంటల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.