సింగపూర్ గత ఏడాది తమ దేశంలో పర్యటించిన విదేశీ పర్యాటకులకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం 2021లో సింగపూర్‌ను సందర్శించిన భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..సింగపూర్ టూరిస్ట్ బోర్డ్ (ఎస్‌టీబీ) 2021లో తమ దేశంలో పర్యటించిన విదేశీ పర్యటకుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. 2019లో దాదాపు 1.42మిలియన్ల మంది భారతీయులు సింగపూర్‌లో పర్యటించారు. అయితే 2021 ఏడాదిలో ఈ సంఖ్య ఘోరంగా పడిపోయింది. గత ఏడాది కేవలం 54వేల మంది భారతీయులు మాత్రమే సింగపూర్‌ను సందర్శించారు. కాగా.. భారతీయులు ఎక్కువ ప్రయాణించే టాప్ 10 డెస్టినేషన్ దేశాల జాబితాలో సింగపూర్ కూడా ఒకటి. అయినప్పటికీ 2021లో చాలా తక్కువ మంది సింగపూర్‌ను విజిట్ చేశారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఇరు దేశాల్లో అమల్లోకి వచ్చిన నిబంధనలు పర్యాటకుల సంఖ్యపై ప్రభావం చూపి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు