WorldWonders

ఈ గిఫ్ట్ ‘కేకు’ కళ్ళు చెదిరే ‘కేక’

ఈ గిఫ్ట్ ‘కేకు’ కళ్ళు చెదిరే ‘కేక’

అందమైన పట్టు చీరలు.. మెడను అలరించే హారం.. చెవులకు జుంకీలు.. ముత్యాల గాజులు.. నుదుటన దిద్దే కుంకుమతో భరిణె. చూపరులను ఇట్టే ఆకర్షించే ఇవన్నీ నిజమైన ఆభరణాలు.. వస్త్రాలు అనుకుంటే పొరపడినట్టే. అలంకరణ వస్తువులతో ముస్తాబు చేసిన అందమైన గిఫ్ట్‌ కేక్‌ ఇది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావుకు చెందిన కాకినాడ హోమ్‌బైట్‌లో దీనిని తయారు చేశారు. 11 కిలోల బరువైన ఈ గిఫ్ట్‌ కేక్‌ను మల్లిబాబు తన చిరకాల మిత్రుడి కుమార్తె నిశ్చితార్దానికి కానుకగా అందజేశారు. మండపేటలో బుధవారం జరిగిన నిశ్చితార్ద వేడుకలో అందజేసిన ఈ కేకును తయారు చేయడానికి పది గంటలు పట్టిందని మల్లిబాబు చెప్పారు.