Business

పోలీసులతో బానే బొంకిన రవిపెకాస్

Raviprakash alleges he is innocent in cyber crime interrogation

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ తొలి రోజు విచారణ ముగిసింది. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు రవిప్రకాశ్‌ను సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని రవిప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చినట్టు సైబర్‌ క్రైం ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్‌ సరైన సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన రెండు కేసుల్లోనూ ఆయనను ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. తొలి రోజు పోలీసు విచారణ ముగిసిన అనంతరం రవిప్రకాశ్‌ మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా మూడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వాస్తవం కోసం, సమాజ హితం కోసం పోరాటం చేస్తానన్నారు. తనకు నైతికంగా మద్దతిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.