Movies

ముసలి మొగుడు కామెంట్ పై సింగర్ సునీత మండిపాటు .

ముసలి మొగుడు కామెంట్ పై సింగర్ సునీత మండిపాటు .

సోషల్‌ మీడియా వచ్చాక పొగడటం కన్నా విమర్శలు గుప్పించడం చాలా ఈజీ అయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఏ ఫొటో పోస్ట్‌ చేసినా సెటైర్‌ వేయడానికి సిద్ధంగా ఉంటున్నారు కొందరు నెటిజన్లు. చాలామంది ఈ విమర్శలను పట్టించుకోరు కానీ చిర్రెత్తితే మాత్రం మరోసారి నోరెత్తకుండా గట్టి కౌంటర్లు ఇస్తారు. తాజాగా సింగర్‌ సునీత కూడా తన భర్తమీద చేసిన కామెంట్‌పై మండిపడింది. హద్దులు దాటి మాట్లాడిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పింది.సునీత, రామ్‌ వీరపనేని దంపతులు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని ఆలయానికి వెళ్లారు. సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం అంటూ ఓ విగ్రహం ముందు దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై ఓ వ్యక్తి.. ‘కాకి ముక్కుకు దొండపండు, సునీతకు ముసలి రామ్‌ మొగుడు! అందం ఈమె సొంతం.. ధనము ఆయన సొంతం! గానం ఈవిడది, దర్జా అతనిది!’ అంటూ పిచ్చి కూతలు కూశాడు.దీంతో మండిపోయిన సునీత.. ‘నోటి దూల నీది, నీ భారం భూమిది’ అని అతడి స్టైల్‌లోనే కౌంటర్‌ ఇచ్చింది. అతడికి తగిన గుణపాఠం చెప్పారంటూ నెటిజన్లు సునీతను మెచ్చుకుంటున్నారు. దీంతో సునీత ఎమోషనల్‌ అవుతూ ‘నాపై మీకున్న గౌరవానికి, అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. అనుకోకుండా ఇలాంటి ఒక కామెంట్‌ ద్వారా నాకోసం నిలబడే నా శ్రేయోభిలాషులు ఇంతమంది ఉన్నారని తెలుసుకుని గర్వపడుతున్నాను. ఎన్నో చూశాను, చూస్తూనే ఉన్నాను. అయినా ఎప్పుడూ ఎవరినీ ద్వేషించే గుణం రాలేదు. ఇక్కడితో వదిలేద్దాం.. సంకుచిత భావాలతో బతికేవారిని ఆ దేవుడు కాపాడుగాక’ అని కామెంట్‌ చేసింది.