అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా భారత సంతతికి చెందిన దేవికా భూషణ్ నియమితులయ్యారు. కాలిఫోర్నియా సర్జన్ జనరల్‌గా నాడిన్ బర్క్ హారిస్ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానాన్ని దేవికా భూషణ్ భర్తీ చేశారు. కొలంబియాలో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దేవికా భూషణ్.. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఎండీ చేశారు. అంతేకాకుండా జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ చిల్డ్రన్స్ సెంటర్‌లో దేవికా భూషణ్.. జనరల్ పీడియాట్రిక్స్ రెసిడెన్సీని పూర్తి చేశారు. ఇదిలా ఉంటే.. దేవికా భూషణ్ తండ్రి పేరు ఇందు భూషణ్. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ మిషన్ తొలి సీఈఓగా ఇందు భూషణ్ పని చేశారు.