కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ.. జనవరిలో అమెరికాలో 4,67,000 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఆ దేశ కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబరుతో పోలిస్తే నిరుద్యోగ రేటు 3.9 నుంచి 4 శాతానికి పెరిగింది. అమెరికాలో జనవరిలో 4.67 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ.. అంచనాలకు మించి నియామకాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ.. జనవరిలో అమెరికాలో 4,67,000 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఆ దేశ కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబరుతో పోలిస్తే నిరుద్యోగ రేటు 3.9 నుంచి 4 శాతానికి పెరిగింది.ఊహించినదానికి మించి నియామకాలు జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. నియామకాలపై వాణిజ్య సంస్థల యాజమాన్యాల్లో ఉన్న ఆత్రుతకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తాత్కాలికమే అనే భావనతో సంస్థలు ఉన్నాయని, దీర్ఘకాల వృద్ధిపై ఆశావహ దృక్పథంతోనే నియామకాలు చేపట్టినట్టుగా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.