అలియాభట్ టైటిల్ రోల్ పోషించిన ‘గంగూబాయి కథియావాడి’ చిత్రం ట్రైలర్ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. 1960వ దశకంలో ముంబై రెడ్లైట్ ఏరియాలోని వేశ్యగా, తనలాంటి వారి తరపున లీడర్గా భిన్న కోణాల్లో అలియా నటన ఆకట్టుకుంది. మాఫియా డాన్ కరీం లాలాగా అజయ్ దేవగణ్ కనిపించారు. ఈ చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ నిర్మించాయి.