*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుల నుంచి రూ.38 లక్షలు విలువచేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
*హైదరాబాద్ నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కింద పడి మురళీ కృష్ణ అనే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయారు. స్కూటీ మీద వెళ్తున్న మురళీ కృష్ణ.. బస్సు వెనుక చక్రం కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని, మురళీ కృష్ణ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
* కళ్యాణదుర్గం మండల పరిధిలోని గంగమ్మ గుడి సమీపంలో ఆటో బోల్తా పడింది. ముదిగల్లు గ్రామం నుంచి టమోటా కోసేందుకు ఆటో కూలీలతో బయలుదేరింది. ఆటో గంగమ్మ గుడి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
* కడపజిల్లాలోని రాజంపేట మండలంలో విషాదఘటన చోటుచేసుకుంది. బాలిక గుళికలు మింగి మృతి చెందింది. మృతురాలు మందరం కొత్తపల్లి గ్రామానికి చెందిన జలగం నాగవేని(గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలను విచారిస్తున్నారు.
* పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్‌లో దారుణం జరిగింది. 7 సంవత్సరాల బాలికపై సవతి తల్లి దాష్టికంగా ప్రవర్తించింది. పనులు చెయ్యడం లేదని బాలిక ఒంటిపై వేడి నీళ్లు పోయడంతో బాలికకు గాయాలయ్యాయి. బాలిక పరిస్థితిపై పోలీసులకు ప్రధాన ఉపాద్యాయురాలు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం బాలిక జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాలిక సవతి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను శిశు గృహకు పోలీసులు తరలించనున్నారు. కేసు ననమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
* వ్యాంగ కుమారుడ్ని హత్య చేసిన దంపతులు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థిరాస్తి వ్యాపారి అయిన 44 ఏండ్ల మహ్మద్ సలీం, భార్య సోఫియాతో కలిసి అవడి ప్రాంతంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు 14 ఏండ్ల అబ్దుల్ సలీం దివ్యాంగుడు. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న కుమారుడ్ని పలువురి వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ దంపతులు తమ జీవితాలను ముగించాలని నిర్ణయించారు. శుక్రవారం తెల్లవారుజామున తొలుత దివ్యాంగ కుమారుడ్ని ఉరి వేసి చంపారు. అనంతరం భార్యభర్తలు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
* జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ లో దారుణం 7 సంవత్సరాల బాలికపై సవతి తల్లి దాష్టికం పనులు చెయ్యడం లేదని బాలిక ఒంటిపై వేడి నీళ్లు పోసిన సవతి తల్లి పలు భాగాల్లో కమిలి పోయిన బాలిక శరీరం… బాలిక పరిస్థితి పై పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రధాన ఉపాద్యాయురాలు….వెంటనే స్పందించిన జంగారెడ్డిగూడెం ఎస్సై సాగర్ బాబు…చికిత్స నిమిత్తం బాలిక జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలింపు….బాలిక సవతి తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…బాలికను శిశు గృహకు అప్పగిస్తామని తెలిపిన పోలీసులు.
* జన్మదిన వేడుకలను ఉల్లాసంగా జరుపుకుని ఇంటికి బయలుదేరిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పెనుమాకకు చెందిన సతీశ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రహదారిపై కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. వేడుకల అనంతరం ఐదుగురు యువకులు రెండు ద్విచక్రవాహనాలపై పెనుమాకకు బయలు దేరారు.
* కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు(33)..భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు శుక్రవారం అంగీకరించాడు.
* హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఫోటో షూట్‌కి వచ్చిన ఇద్దరు స్నేహితులు ప్రమాదవశాత్తు గండి చెరువులో పడి మృతి చెందారు. మృతులు హరీష్, సుధాకర్‌గా గుర్తించారు. హరీష్ మృతదేహం లభ్యం అవగా…సుధాకర్ మృతదేహం కోసం ముమ్మరంగా గాలింపు చర్యులు చేపట్టారు. ఎన్టీఆర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గండి చెరువు చెక్ డ్యామ్‌లో గతంలో కూడా ఫోటోలు దిగడానికి వచ్చి విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో చెరువు చుట్టూ డేంజర్ జోన్‌ను ఏర్పాటు చేయాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
*దిండుగల్ జిల్లా గోపాలపట్టిలోని బహుళ అంతస్తుల వస్త్ర దుకాణంలో గురువారం అర్ధరాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో రూ. కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. దుస్తులుఏసీ పరికరాలుఫర్నిచర్‌ఇతర వస్తువులు బుగ్గి పాలయ్యాయి.
*అనంతపురం జిల్లాలో శుక్రవారం ఒకే రోజు కొవిడ్తో ముగ్గురు మృతి చెందారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో గత మూడు రోజులుగా మరణాలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 1,878 శాంపిల్స్ పరీక్షించగా 245 మందికి పాజిటివ్ వచ్చింది.
* మంగళగిరి మండలంలోని కృష్ణయపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతులు పెనుమాకకు చెందిన షేక్ పై కంబర్, షేక్ రాజా, సతీష్ రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు.
*పెరూ దేశంలో టూరిస్టు విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. ఏరోసాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజిన్ విమానం నజ్కాలోని మరియా రీచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి పోయింది.పెరూలోని ప్రసిద్ధ నజ్కా మార్గాలను వీక్షించేందుకు వెళ్లిన వారి విమానం కూలిపోవడంతో ఐదుగురు పర్యాటకులు, ఇద్దరు పైలెట్లు మరణించారని పెరూ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంలో ఉన్న ఏడుగురిలో ఎవరూ ప్రాణాలతో లేరని అధికార వర్గాలు తెలిపాయి.విమానంలో ఉన్న ఏడుగురిలో ఇద్దరు చిలీ పర్యాటకులు ఉన్నారని దౌత్యఅధికారి తెలిపారు.
*పెరూ దేశంలో టూరిస్టు విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. ఏరోసాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజిన్ విమానం నజ్కాలోని మరియా రీచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి పోయింది.పెరూలోని ప్రసిద్ధ నజ్కా మార్గాలను వీక్షించేందుకు వెళ్లిన వారి విమానం కూలిపోవడంతో ఐదుగురు పర్యాటకులు, ఇద్దరు పైలెట్లు మరణించారని పెరూ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంలో ఉన్న ఏడుగురిలో ఎవరూ ప్రాణాలతో లేరని అధికార వర్గాలు తెలిపాయి.విమానంలో ఉన్న ఏడుగురిలో ఇద్దరు చిలీ పర్యాటకులు ఉన్నారని దౌత్యఅధికారి తెలిపారు.
*కూలీ పని చేసుకునే ఆ దంపతులు ఎంతో కష్టపడి పెద్ద కొడుకును డిగ్రీ వరకు చదివించారు. పై చదువులకు ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఆ యువకుడు సొంతంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కొలువు రాకపోవడంతో తల్లిదండ్రుల సహకారంతో పీజీ పూర్తి చేశాడు. ఈ సారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే ప్రస్తుతం తమ కుటుంబం వద్ద అందుకు సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో శుక్రవారం జరిగింది. నిర్వేన్ గ్రామానికి చెందిన సంద వెంకటమ్మ, బాలయ్య దంపతులకు ముగ్గురు సంతానం. కూలీ పనులు చేసి కుమారుడు కురుమూర్తి (26)ని పీజీ వరకు చదివించారు. కురుమూర్తి డిగ్రీ పూర్తి అయిన నాటి నుంచే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో గత ఏడాది ఎకనామిక్స్లో పీజీ పూర్తిచేశాడు. ఈసారి ఏదో ఒక ఉద్యోగం సాధించాలని కోచింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు.
*కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.12.25 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనూరు ఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం మనూరు చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి వస్తున్న వాహనం (టీఎస్16 యూసీ 8055)ను తనిఖీ చేసి, అందులో పెద్దఎత్తున గుట్కా పాకెట్ల బ్యాగులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో ఉన్న 70 గుట్కా పాకెట్ల బ్యాగులను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. డ్రైవర్ నగేష్ను విచారించగా బీదర్ నుంచి తెలంగాణాలోని నిజామాబాద్కు తరలిస్తున్నట్లు చెప్పాడన్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు.
*గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పుట్టిన పుట్టినరోజు వేడుకలు ముగించుకొని కృష్ణాయపాలెం నుంచి పెనుమాక వస్తుండగా
ఓ ద్విచక్ర వాహనం కరెంటు స్తంభానికి ఢీకొట్టింది.
* హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటినతర్వాత నాంపల్లిలోని ఫ్యాబ్సి వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న అపార్టుమెంటులో మంటలు చెలరేగాయియి. భయాందోళనకు గురైన అపార్ట్‌మెంట్‌వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.