DailyDose

సమ్మె పై కొనసాగుతున్న సస్పెన్స్ – TNI తాజా వార్తలు 05/02/2022

సమ్మె పై కొనసాగుతున్న సస్పెన్స్ – TNI  తాజా వార్తలు 05/02/2022

*జగన్ తో ముగిసిన మంత్రుల భేటీ-కాసేపట్లో ఉద్యోగులకు క్లారిటీ- 27 శాతానికి ఫిట్ మెంట్ ?
ఏపీలో ఉద్యోగులు రేపు అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. నిన్నటివరకూ పీఆర్సీ సహా ఇతర డిమాండ్లపై మొండిగా వ్యవహరించిన ప్రభుత్వం నిన్న రాత్రి మాత్రం పీఆర్సీ సాధన సమితి నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు సానుకూలంగా జరిగినట్లు ఇటు ప్రభుత్వం తరఫున మంత్రుల కమిటీతో పాటు ఉద్యోగుల తరఫున స్టీరింగ్ కమిటీ కూడా ప్రకటించాయి. దీంతో ఉద్యోగులు సమ్మె విరమించే అవకాశముందని ప్రభుత్వం లీకులు ఇస్తోంది. అయితే ఉద్యోగులు మాత్రం ఇంకా ఏమీ తేలలేదని కౌంటర్లు ఇస్తున్నారు.ఉద్యోగుల సమ్మెపై ఇవాళ తేలిపోతుందని ఉదయం నుంచీ ప్రభుత్వం నియమించిన కమిటీలో ఉన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినాని లీకులు ఇస్తున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు చెప్పినట్లుగానే సీఎం జగన్ తో మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగుల కోర్కెలను ఆయన ముందుపెట్టారు. వాటిపై జగన్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రులు చెప్తున్నారు. అయితే ఈ వివరాలను తిరిగి ఉద్యోగుల ముందు ఉంచి వీటిపై తుది నిర్ణయానికి రావాల్సి ఉంది. ఏకాభిప్రాయం కుదిరితే మాత్రం ఈ సాయంత్రానికి ఓ ప్రకటన వచ్చే అవకాశముంది.సీఎం జగన్ తో జరిపిన చర్చల్లో లేవనెత్తిన అంశాలు, వాటికి జగన్ స్పందన వంటి అంశాలను మంత్రులు ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు ఉద్యోగసంఘాల పీఆర్సీ సాధన సమితితో మంత్రులు భేటీ అవుతున్నారు. పీఆర్సీ ఫిట్ మెంట్ శాతం మివహా మిగిలిన అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఈ ఒక్క అంశంపైనా వెనక్కి తగ్గితే సమ్మె విరమించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది చర్చలు జరిపేందుకు ఉద్యోగసంఘాలతో సచివాలయంలో మంత్రులు సమావేశమవుతున్నారు.

*ఏపీకి రెవెన్యూ గ్రాంట్‌ను కేంద్రం విడుదల చేసింది. రెవిన్యూ లోటు కింద ఏపీకి రూ.1438.08 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ విడత రెవెన్యూ గ్రాంట్ నిధులను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు నిధులను విడుదల చేసింది

*మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం కొనసాగుతోంది. పీఆర్సీ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు సచివాలయంలో శనివారం మరోసారి పూర్తిస్థాయి చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు చర్చల్లో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది.

* ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ లోగోను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇక్రిశాట్‌లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్రిశాట్‌ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు.

* వైద్య, ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్‌ల ఉద్యోగుల సాధారణ బదిలీల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. విభాగాల వారీగా అందరు ఉద్యోగుల సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా బదిలీ ప్రక్రియ చేపడుతున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో 13 జిల్లాల్లోని మెడికల్‌ కళాశాలల్లో ట్యూటర్‌ల నుంచి ప్రొఫెసర్‌ స్థాయి వరకూ బదిలీలకు అర్హులైన వారి గుర్తింపు పూర్తయింది.

* తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉంటారు. శంషాబాద్‌లో ప్రధానిని రిసీవ్‌ చేసుకునే కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటారు. ముచ్చింతల్‌ కార్యక్రమానికి సీఎం హాజరయ్యే అవకాశం ఉంది.

* డ్రగ్స్‌ కేసుపై ఈడీకి సమాచారం అందింది. మనీలాండరింగ్‌హవాలా జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. టోనీతోపాటు కొంతమంది నైజీరియన్లు హవాలా చేసినట్లు ఈడీ గుర్తించింది. అలాగే వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న నగదును వస్తువుల రూపంలో మార్చి విదేశాలకు తరలించినట్లు కూడా గుర్తించింది. వస్త్రాలువిగ్గులుఆటవస్తువుల రూపంలో నైజీరియాకు ఎగుమతి చేశారు. గతనెల న సిటీ పోలీసులు ఈడీకి సమాచారం అందించారు. వ్యాపారవేత్తలనుటోనీని ప్రశ్నించాలని ఈడీకి పోలీసుల విజ్ఞప్తి చేశారు.

* భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన మహేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్‌ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి కొనియాడారు. శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌)లో జరిగిన ఎంఎస్‌డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ–ఆర్కా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మిహిర్‌ దివాకర్‌ పాల్గొన్నారు.

* బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ సతీమణి, ప్రముఖ నటి జయా బచ్చన్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. గతేడాది అమితాబ్‌, అభిషేక్‌లతో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలు అందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టవశాత్తూ జయాబచ్చన్‌ మాత్రం తప్పించుకోగలిగారు. అయితే తాజాగా జరిపిన కోవిడ్‌ పరీక్షల్లో మాత్రం ఆమెకు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది.

* తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ పార్క్ కూడలిలో విద్యుత్ ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించి జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా విధులు నిర్వహించిన తమకు ఎంత మాత్రం గుర్తింపు లేదని విద్యుత్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

* ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌డోర్‌ డెలివరీ విధానాన్ని కర్ణాటక పౌర సరఫరాల కమిషనర్‌ అధికారి కనకవల్లి అధ్యయనం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని పరిశీలించారు.

* దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పెద్దయెత్తున వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 168.98 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటన లో వెల్లడించింది.గడిచిన 24గంటల్లో 47 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికరీ రేట్ 95.64 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 11.21 శాతంగా అధికారులు తెలిపారు.

* ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమగా ఉందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ ప్రతిత్ సంధాని సారథ్యంలో వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. గత నెలలో కోవిడ్ బారిన పడటంతో లతామంగేష్కర్‌ను ఆసుపత్రిలో చేర్చారు.

* బిజెపి సీనియర్ నాయకుడుమాజీ ఎంపి చందుపట్ల జంగారెడ్డి మృతికి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి మరణం వరంగల్ ప్రజలకురాజకీయాలకు తీరని లోటు.వారి ఆలోచనలు ఎప్పుడు ప్రజల గురించే వుండేవని అన్నారు.పేద‌లకుఅణ‌గారిన వ‌ర్గాల వారికి సేవ‌ చేయడంలో ఆయ‌న చూపిన నిబ‌ద్ధ‌తచొరవ తన లాంటి నాయకులకు స్ఫూర్తినిస్తుందన్నారు.ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియచేశారు.

* ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల జేఎసీ అధ్వర్యంలో సెంట్రల్ బస్టాండు వద్ద నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఎసీ నేత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినా ఉద్యోగుల సమస్యల ఇప్పటికీ పరిష్కరం కాలేదని… అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తొలగించిందన్నారు. విలీనం జరిగిందని ఆనందపడాలో… ఉన్న వసతులు పోయినందుకు భాదపడలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 15 డిపోల ఉద్యోగుల నిరసన జరుగుతోందని చెప్పారు. 2004 ముందు ఉన్న పెన్షన్ విధానాన్ని ఆర్టీసీలో అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ పెన్షన్ కచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

*బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి… హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు ఇబ్బందికలగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

*ఉత్తర భారతం శనివారం ఉదయం ప్రకంపనలతో వణికిపోయింది. కొద్ది సెకండ్లపాటు స్వల్ఫ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.అఫ్గనిస్థాన్‌-తజికిస్థాన్‌ సరిహద్దు కేంద్రం ఈ ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతోనే ఉత్తర భారతంలో పలు చోట్ల భూమి కంపించింది. ఉత్తర ప్రదేశ్‌ నొయిడాలో సుమారు 20 సెకండ్లపాటు ప్రకంపనలు ప్రభావం చూపించినట్లు పలువురు ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంకోవైపు ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌(లోయ), ఉత్తరకాశీ(ఉత్తరాఖండ్‌), మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మన దేశంలో తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదు అయ్యింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు.

*పాకిస్థాన్‌ దేశంలో శనివారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత జమ్మూ కశ్మీర్, నోయిడా,ఢిల్లీ, ఎన్సీఆర్ ఇతర ప్రాంతాల్లో భూమి ప్రకంపించింది.ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ధృవీకరించింది. శనివారం ఉదయం 9.45 గంటలకు 181 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:18 గంటలకు భూకంపం సంభవించిందని యూరో-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం ఆఫ్ఘనిస్తాన్‌లోని అష్కాషమ్‌కు నైరుతి దిశలో 45 కిలోమీటర్ల దూరంలో సంభవించింది.దీంతోపాటు శనివారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.

*అడవి నుంచి తప్పిపోయిన ఓ దుప్పి శ్రీశైలంలోని వీఐపీ కాటేజ్‌లోకి వచ్చింది. దుప్పిని చూసిన కుక్కలు దాన్ని తరమడం మొదలుపెట్టాయి. దీంతో కుక్కల నుంచి తప్పించుకోబోయిన దుప్పి వీఐపీ కటేజ్ బయట ఉన్న జాలిలోకి దూకింది. దుప్పి ఇబ్బందిని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది… అడవి దుప్పిని జాలి నుంచి బయటకు తీసి సురక్షితంగా అడవిలోకి పంపించారు.

* చెన్నైలో వచ్చే జూన్ నుంచి పైప్లైన్ గ్యాస్ (పీఎల్జీ) పథకం అమలులోకి రానుంది. రాబోయే ఎనిమిదేళ్లలో ఈ పథకం ద్వారా సుమారు 33 లక్షల మంది వినియోగ దారులు లబ్ధిపొందే అవకాశముందని చమురు సంస్థలు ప్రకటించాయి.

*కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- కర్నూల్సిటీ, కర్నూల్ సిటీ-కాచిగూడ, కాచిగూడ రాయిచూర్- రాయిచూర్ – కాచిగూడ, కాచిగూడ- మహబూబ్నగర్, మహబూబ్నగర్- కాచిగూడ రైళ్లను ఈనెల 7 నుంచి 9 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే గుంటూరు-కాచిగూడ, కాచిగూడ-గుంటూరు రైలును 6 నుంచి 10 వరకు రద్దుచేసినట్లు వారు చెప్పారు.

*కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎ్ససీఈ) బోర్డు 10(ఐసీఎ్సఈ), 12(ఐఎ్ససీ) తరగతుల మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 7న విడుదల చేస్తామని బోర్డు సీఈ జెర్రీ అరాథూన్ శుక్రవారం వెల్లడించారు. కౌన్సిల్ వెబ్సైట్లోని కెరీర్స్ పోర్టల్లో లాగిన్ అయి లేదా ఎస్సెమ్మె్సల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చన్నారు. గత నవంబరు 29 నుంచి డిసెంబరు 16 మధ్య ఐసీఎ్సఈ పరీక్షలు, నవంబరు 22 నుంచి డిసెంబరు 20 మధ్య ఐఎ్ససీ పరీక్షలు జరిగాయి.

*కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ప్రాజెక్టుల సం దర్శనకు వెళ్లనుంది. పులిచింతలతో పాటు ప్రకాశం బ్యారేజీ, కృష్ణా డెల్టా సిస్టమ్ తదితర కాంపోనెంట్లను బోర్డు పరిశీలించనుంది.

*తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాయంలో ఓ ప్రొఫెసర్ తీరు విమర్శలకు తావిస్తోంది. అకాడమిక్ డీమ్డ్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి ప్రతి రోజు తన ఎలక్ట్రిక్ బైక్కు వర్శిటీ భవనంలో చార్జింగ్ పెట్టుకుంటున్నారంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలకు రూ. 2 లక్షల 50 వేలు జీతం తీసుకుంటూ.. ఇలా యూనివర్శిటీలో చార్జింగ్ పెట్టుకోవడం ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రొఫెసర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా కక్కుర్తి పడటం వర్శిటీ చరిత్రలో ఎన్నడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు కృష్ణమూర్తిపై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తన సొంత ఎలక్ట్రిక్ బైక్కు వర్శిటీలో చార్జింగ్ పెట్టుకోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

*ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత లేదు. సీజన్కు సరిపడా అన్ని రకాల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగుల సమ్మె నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలా బూటకపు ప్రచారం చేస్తున్నారు’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఆరోపించారు.

*ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్) జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్లను వాహనాలకు తప్పనిసరి చేసేందుకు భారత ప్రభు త్వం ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది.

*దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాసలీలల సీడీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత రమేశ్ జార్కిహొళికి క్లీన్చిట్ లభించింది. ఈ కేసును విచారించిన సిట్ బృందం హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఒకటో ఏసీఎంఎం కోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ కేసులో రమేశ్ జార్కిహొళి పాత్ర లేదని తేలడంతో ఆయనకు ఉపశమనం లభించింది.

*ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు(ఏటీఎస్) జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్లను వాహనాలకు తప్పనిసరి చేసేందుకు భారత ప్రభు త్వం ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించింది.