Movies

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అస్తమయం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అస్తమయం

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. జనవరి 8న ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన తర్వాత ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చేరారు.ఆమె గత రెండు వారాలుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యంలో మెరుగుదల సంకేతాలు కనిపించడంతో, ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. కరోనా ద్వారా న్యూమోనియా కూడా అటాక్ అయింది. అయితే గతనెల చివరిలో లత ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. కరోనా, న్యూమోనియా నుంచి కోలుకున్నట్లు వెల్లడిచారు. అయితే మరో సారి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆమె కన్నుమూసింది. ఆమె మరణవార్త తెలుసుకున్న యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.