సమాజ్‌వాదీ-ఆర్ఎల్‌డీ కూటమి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకుంటుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.అధికార పార్టీపై ప్రజాగ్రహమే తమ పార్టీకి భారీగా సీట్లు తెచ్చిపెడతాయని, 400 సీట్లు తమ కూటమి గెలుచుకుంటే, తక్కిన వారికి వచ్చేవి 3 సీట్లేనని అలీగఢ్‌లో మాట్లాడుతూ ఆయన అన్నారు.త్తరప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులను కాపాడటంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై జరిగిన కాల్పుల ఘటనను తాము వెంటనే ఖండించామని చెప్పారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని అన్నారు. ఇలాంటి పరిస్థితులు తాము చాలానే చూశామని చెప్పారు. హథ్రాస్ ఘటనపై మాట్లాడుతూ, న్యాయం జరగాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారని, ఆమెకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపాలని అనుకున్నారని, అయితే ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని విమర్శించారు. ఆసుపత్రిలో ఆమెకు తగిన చికిత్స అందించి ఉంటే ఆమె ఈరోజు బతికి ఉండేదని అన్నారు.