Devotional

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

**రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :
సూర్యప్రభ వాహనం       ఉదయం     6 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.43 గంట‌ల‌కు)
చిన్నశేష వాహనం       ఉదయం       9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు
గరుడ వాహనం         ఉదయం      11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు
హనుమంత వాహనం     మధ్యాహ్నం   1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు
చక్రస్నానం            హ్నం      2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు (రంగనాయకుల మండపంలో గంగాళంలో నిర్వ‌హిస్తారు.)
కల్పవృక్ష వాహనం      సాయంత్రం    4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు
సర్వభూపాల వాహనం  సాయంత్రం   6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు
చంద్రప్రభ వాహనం      రాత్రి       8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

*ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే వ‌ర్చువ‌ల్ ఆర్జిత సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.