NRI-NRT

12న ఎన్నారై లతో కేటీఆర్ సమావేశం

12న ఎన్నారై లతో కేటీఆర్ సమావేశం

ఎన్నారైలతో “మన ఊరు మన బడి” కార్యక్రమములో పాల్గొననున్న మంత్రులు కేటీర్, సబితా ఇంద్రారెడ్డి: ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల 
మన ఊరు మన బడి  కార్యక్రమంలో  ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.  మ‌న ఊరు – మ‌న బ‌డి విధివిధానాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మ‌న ఊరు – మ‌న బ‌డి, ప‌ట్ట‌ణాల్లో మ‌న బ‌స్తీ – మ‌న బ‌డితో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్యక్రమము  ఫై   ఎన్నారైలకు విధి విధానాలను వివరించి వాళ్ళని భాగస్వాములను చేయడానికి ఫిబ్రవరి 12  న ప్రపంచ వ్యాప్తంగా వున్నా ఎన్నారై సంఘాలతో జూమ్ ఆన్లైన్ కార్యక్రములో  మంత్రులు కేటీర్, సబితా ఇంద్రారెడ్డి గారు పాల్గొననున్నట్టు  ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు, మన ఊరు – మన బడి అనేది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం,ఇంత  పెద్ద ఫ్లాగ్ షిప్ కార్యక్రం ద్వారా  రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయి , ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ విద్య, ఆధునికీకరించిన టాయిలెట్లు, వంద శాతం విద్యుదీకరణ, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఫర్నిచర్, కొత్త తరగతి గదులు, సురక్షితమైన తాగునీటి సరఫరా, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు, మెరుగైన వంటశాలలు, డైనింగ్  హాళ్లతో సహా 12 రకాల అభివృద్ధి పనులు చేపడతారు.10 లక్షలు దానం చేసిన దాతలకు వారు సూచించిన వారి పేరును స్కూలు లో నామకరనం చేస్తారని చెప్పారు, ఎన్నారైలందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మహేష్ బీగాల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమము  ఫై   ఎన్నారైలకు విధి విధానాలను వివరిస్సతీరని తెలిపారు.